వైరల్: ఓట్ అంటూ డ్యాన్స్ వీడియో ట్వీట్ చేసిన ట్రంప్‌!

ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికల డేట్.నవంబర్ 3వచ్చేసింది.

 Donald Trump, America, Republican Party, Joe Biden, Democratic Party, Trump Vot-TeluguStop.com

కరోనా వల్ల ఇప్పటికే లక్షలాది మంది ఓటర్లు ముందే మెయిల్ ఇన్ ఓట్లు వేశారు.ఇక మిగిలిన వాళ్లు లోకల్ టైమ్ ప్రకారం ఓటు వేస్తున్నారు.

ఇక పోటీ పోటీగా జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ట్రంప్, డెమో క్రటిక్ అభ్యర్ధి జోబిడెన్ లు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివరి అంకంలో ట్రంప్ దూకుడు పెంచారు.

తన మద్దతు దారుల్లో ఉత్సాహం నింపేందుకు స్టెప్పులేశారు.ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు ఓవీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

హాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తూ ఉత్సాహం నింపేందుకు హడావిడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఓట్ ఓట్ ఓట్ అంటూ జేమ్స్ బాండ్ స్టైల్లో ఆయన వేసిన స్టెప్పులకు మద్దతు దారులు ఫిదా అయ్యారు.

మారో నాలుగేళ్ల కోసం ఓటేయని మాత్రమే చెప్పిన ట్రంప్ ఎక్కడా కూడా తనకు ఓటు వేయమని చెప్పకుండా ఎన్నికలపై హైప్ క్రియేట్ చేశారు.దానికి కారణం.ఓట్ల కోసం ట్రంప్ పడే పాట్లనే విమర్శలొస్తాయని ఊహించిన ట్రంప్ ఓట్ ఓట్ ఓట్ అంటూ స్లోగన్లు వినిపించడం ఆసక్తికరంగా మారింది.మరోవైపు జోబిడెన్‌ కూడా ట్రంప్‌కు ధీటుగా ప్రచారం చేశారు.

గత ఎన్నికల్లో డెమోక్రాట్‌లకు మద్దతుగా నిల్చిన రాష్ట్రాల్లో విస్తృత పర్యటనలు చేశారు.తమను భారీ మెజార్టీతో గెలిపించాలని, విజయం సాధిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.గత ఎన్నికల్లో తమకు మెజారిటీ తగ్గిన రాష్ట్రాల్లో ఓటర్లను వ్యక్తిగతంగా కూడా కలుసుకునేందుకు ఆయన ప్రాధాన్యతనిచ్చారు.కాగా ట్రంప్ తరహాలో బీడెన్ ఎక్కడా ప్రచారం చేయలేదు.

కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉన్నారు.కాగా యూఎస్ లోని కొన్నిరాష్ట్రాల్లోని ఎన్నికలు నవంబర్ 3 ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి.

న్యూ హాంప్‌షైర్‌లో మాత్రం అర్ధరాత్రి 2 గంటల నుంచే పోలింగ్ మొదలైంది.ఇక్కడ ఓటింగ్‌తోనే అమెరికా ఎన్నికల పోలింగ్ ప్రారంభమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube