ట్రంప్ మరో సంచలన నిర్ణయం..వారికి మరణ శిక్షేనట..!!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటారు.చేసే పనుల్లో, మాట్లాడే మాటల్లో, హావభావాలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే ట్రంప్, ఒక్కో సారి ఆ వ్యాఖ్యల ద్వారా పరువు పోగొట్టుకుని సర్వాత్రా వ్యతిరేకత మూటగట్టుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

 America President Donald Trump Sensational Comments On Police Attack, Police Att-TeluguStop.com

తాజాగా ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.ఎన్నికల ప్రచారంలో ప్రజలని ఉత్తేజపరిచే వాగ్దానాలు ఇవ్వడంలో దిట్టగా పేరున్న ట్రంప్ పోలీసులపై దాడులకు సంభందించిన విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

నెవాడా లో ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.రిపబ్లికన్ పార్టీకి కొండంత అండగా ఉన్న ఈ నెవాడా 2004 నుండీ రిపబ్లికన్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది.

అంతేకాదు ఇక్కడ నుంచీ ఎంతో మంది పోలీసు శాఖలో ఉద్యోగాలు చేపట్టారు కూడా.అయితే ఇక్కడ ప్రచారం ప్రారంభించిన ట్రంప్ పోలీసులపై దాడులని ప్రస్తావిస్తూ లాస్ ఏంజిల్స్, కాప్టన్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు పోలీసుల అధికారులపై దాడులు జరిగాయని తుపాకి తో ఉన్న ఒక వ్యక్తి ఈ దాడులు చేశాడని అలాంటి వాడిని మనిషి అని నేను పిలవలేను పశువు అంటేనే బాగుంటుందని అన్నారు…అంతేకాదు

అమెరికా కోసం కష్టపడి పనిచేస్తున్న పోలీసులపై దాడులు చేసి చంపిన వారికి ఉరి శిక్ష సరైన శిక్ష అని తాను అభిప్రాయపడుతున్నట్లుగా తెలిపారు.

అనేక దాడుల్లో మహిళా పోలీసులు కూడా తీవ్రంగా గాయాల పాలైనారని అన్నారు.కొందరు కోలుకుంటుంటే మరికొందరు శాశ్వతంగా మంచానికే పరిమితమవుతున్నారని ఇలాంటి దుండగులకి సామాన్యమైన శిక్షలు సరిపోవని, మరణ శిక్షే సరైన నిర్ణయమని అన్నారు.

తాజాగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై అమెరికన్స్ నుంచీ మద్దతు రాగా నిపుణులు మాత్రం ఈ తరహా వ్యాఖ్యలు సరైనవి కావని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube