పావుగంటలో కరోనా నుంచి కోలుకోవచ్చు.. ట్రంప్ వింత వ్యాఖ్యలు?  

donald trump sensational comments about corona virus America, Donald Trump, Baren Trump, Coronavirus, Childrens Immunity Power, American Academy Of Pediatrics, American Schools - Telugu America, American Academy Of Pediatrics, American Schools, Baren Trump, Childrens Immunity Power, Coronavirus, Donald Trump, Donald Trump Sensational Comments About Corona Virus

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు, వింత వ్యాఖ్యలు చేసి గతంలో అనేక సందర్భాల్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.తాజాగా ట్రంప్ మరోమారు కరోనా గురించి విచిత్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

TeluguStop.com - Donald Trump Sensational Comments About Corona Virus

కేవలం 15 నిమిషాల్లో తాను కరోనా నుంచి తన కుమారుడు కోలుకున్నాడని ట్రంప్ వెల్లడించారు.మరో వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలు దగ్గరబడటంతో విమర్శల్లో పదును పెంచిన ట్రంప్ తన కొడుకు బారన్ కు కరోనా సోకిన విషయం అందరికీ తెలుసని.వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి బారన్ కు కరోనా సోకిందని చెప్పారని.

TeluguStop.com - పావుగంటలో కరోనా నుంచి కోలుకోవచ్చు.. ట్రంప్ వింత వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే మళ్లీ పావుగంట తరువాత వైద్యులను అడగగా బారన్ కు కరోనా పోయిందని చెప్పారంటూ వింత వ్యాఖ్యలు చేశారు.పెద్దవాళ్లతో పోల్చి చూస్తే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

కరోనా పిల్లలకు సోకినా అనవసరంగా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని.వాళ్లు బలంగా ఉంటారని పేర్కొన్నారు.

పిల్లల్లో ఇమ్యునిటీ పవర్ ఉండటం వల్ల వాళ్లు పాఠశాలలకు హాజరైనా ఎలాంటి సమస్య ఉండదని.కరోనా విజృంభణ వల్ల స్కూళ్లను మూసివేయడం సరైన చర్య కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ 7,92,000 మంది పిల్లలకు వైరస్ సోకినట్టు వెల్లడించింది.

దీంతో అమెరికాలోని తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు.

పాఠశాలలకు పంపితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిల్లలు వైరస్ బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతూ ఉండటంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.ట్రంప్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

#Coronavirus #America #DonaldTrump #AmericanAcademy #Donald Trump

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Donald Trump Sensational Comments About Corona Virus Related Telugu News,Photos/Pics,Images..