సీన్ రివర్స్..ట్రంప్ ఊహించని ట్విస్ట్..ఇలా జరిగిందేంటి..!!!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇక శుభం కార్డు పడినట్టే.ఎవరు ఈ సారి ఎన్నికల్లో విజయం సాధిస్తారోనని వెయ్యి కళ్ళతో వేచి చూసిన అమెరికన్స్ కు, ప్రపంచ దేశాలకు ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది.

 Big Shock To Donald Trump Over America Elections, Donald Trump , America Electi-TeluguStop.com

ఇక మిగిలింది బిడెన్ ను అధికారికంగా ప్రెసిడెంట్ గా ప్రకటించడం అలాగే వైట్ హౌస్ లో బిడెన్ కాలు మోపడం.అయితే తన ఓటమిని ముందు నుంచీ ఒప్పుకొని ట్రంప్ ఎన్నికలు జరగకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు.

అంతేకాదు ఎన్నికలు జరగకుండానే తనకు అన్యాయం జరిగిందని అనిపిస్తే సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.అయితే

అన్నట్టుగానే ట్రంప్ ఫలితాల సరిళిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తానూ సుప్రీం కోర్టుకు వెళ్తానని పిటిషన్ వేస్తానని ప్రకటించారు.

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ట్రంప్ కోర్టుకు వెళ్తానని చెప్పడంపై తన సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఎన్నికల ప్రక్రియపై విచ్చలవిడిగా విమర్శలు చేయడం, తానె ప్రెసిడెంట్ గా ఎన్నికవుతానని ప్రకటించడం వంటి విషయాలపై తన సొంత క్యాంప్ లోని నేతలు విమర్శలు చేస్తున్నారు.

Telugu America, Bigshock, Donald Trump, Joe Biden, Marco Rubio, Republican-Telug

సెనేట్ లో ట్రంప్ కి మద్దతు దారులుగా ఉన్న కొందరు నేతలు బహిరంగంగా విమర్శలు చేయడంతో ట్రంప్ ఊహించని షాక్ తిన్నారు.కెంటకీ నుంచీ రిపబ్లికన్ పార్టీ తరుపున గెలుపొందిన మిచ్ మెక్ కెనాల్ ట్రంప్ కి మంచి సన్నిహితుడిగా ఉండేవారు.ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తాజాగా వ్యతిరేకత వ్యక్తం చేశారు.గెలిచానని చెప్పుకోవడం వేరని, ఓట్ల లెక్కింపులో గెలడవం వేరని ట్రంప్ ఈ వ్యత్యాసం తెలుసుకోకుండా మాట్లాడటం మంచిది కాదని బహిరంగంగా విమర్శించారు.

కేవలం మిచ్ మాత్రమే కాదు ఫ్లోరిడా సెనేటర్ మార్క్ రూబియో ట్విట్టర్ వేదికగా ట్రంప్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.ప్రజలు వేసిన ఓట్లను చట్టబద్దంగా రాలేదని చెప్పడం మంచిది కాదని అన్నారు.

ఇదిలాఉంటే ట్రంప్ చర్యల కారణంగా మరో సారి రిపబ్లిక్ నేతగా ఎన్నుకునే అవకాశాలు కూడా లేవని అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube