అమెరికా విడిచి వెళ్ళిపోతా..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!

అమెరికాలో మరో 15 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ సారి గెలుపుపై డెమోక్రటిక్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంటే.

 If Biden Wins I Will Left America Says Donald Trump, Donald Trump, Americans, Am-TeluguStop.com

రిపబ్లికన్ పార్టీ కూడా అదే స్థాయిలో విజయంపై ఆశలు పెట్టుకుంది.అధికార పీటం దక్కించుకోవడానికి ఎవరి వ్యూహాలు వారికి ఉన్నా బిడెన్ మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారని అంటున్నారు పరిశీలకులు.

ఇక ట్రంప్ విషయానికి వస్తే గత ఎన్నికల మాదిరిగానే అమెరికా ప్రజలను సెంటిమెంట్ తో పడేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మొదలు గెలుపు కోసం అమెరికన్స్ ని ఆకర్షించడానికి చేయని ప్రయత్నమంటూ లేదు.
తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.జరగబోయే అధ్యక్ష్య ఎన్నికల్లో తాను ఓడిపోతే అమెరికాని విడిచి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ కి పట్టున్న జార్జియా, ఫ్లోరిడాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ప్రజలని ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ అక్కడి ప్రజలలో సెంటిమెంట్ రగిల్చే క్రమమంలో ఈ ఎన్నికలు మనకి ఎంతో ముఖ్యమైనవి, ఒక వేళ నేను ఓడిపోతే అమెరికా విడిచి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని భావోద్వేగంతో కూడిన ప్రకటన చేశారు.

ఓడిపోతాను అనే విషయం ముందే గ్రహించారా లేక వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారా అనే సందేహాలు కూడా లేకపోలేదు.


బిడెన్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిపించకండి అమెరికాని చైనా కి తాకట్టు పెట్టేస్తాడంటూ తనదైన శైలిలో బిడెన్ పై విరుచుకుపడ్డారు ట్రంప్.

అయితే ట్రంప్ చేసిన ఈ తాజాగా వ్యాఖ్యలు ట్రంప్ లో భయాన్ని, ఆందోళనను తెలియజేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.ఓడితే అమెరికా విడిచి వెళ్ళిపోతాను అనే వ్యాఖ్యలు ట్రంప్ ఓటమిని ముందుగానే ఒప్పుకున్నట్టుగా ఉన్నాయని ఎన్నికలు కేవలం రోజుల వ్యవధిలో ఉన్న తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలు అసలుకే మోసం తెస్తాయని హెచ్చరిస్తున్నారు.

ట్రంప్ వ్యవహార శైలిపై రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube