స్పీడు పెంచిన ట్రంప్...సేవ్ అమెరికా వేదికగా బిడెన్ పై ఘాటు వ్యాఖ్యలు..!!

అమెరికన్స్ కు బిడెన్ ప్రభుత్వంపై నమ్మకం లేదా అంటే అవుననే అంటున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.అధ్యక్ష్య ఎన్నికల్లో ఓటమి తరువాత పెద్దగా మీడియా ముందుకు రాని ట్రంప్ గడిచిన కొంత కాలంగా బిడెన్ పై మాటల తూటాలు పేల్చుతున్నారు.

 Donald Trump Sensational Comments On Us President Joe Biden, Donald Trump, Us P-TeluguStop.com

బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికాకు ఒరిగింది ఏమి లేదని చెప్పిన ట్రంప్, గొప్పలు చెప్పుకోవడంలో మాత్రం ముందు నిలిచారని ఎద్దేవా చేశారు.అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గొప్పగా జరుగుతోందని చెప్పుకుంటున్న బిడెన్ ప్రభుత్వ మాటల్లో వాస్తవం లేదని, అవన్నీ ఉత్తుత్తి ప్రచారాలేనని కొట్టిపారేశారు.

ప్రస్తుతం అమెరికాలో వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మందకొడిగా సాగుతోందని అన్నారు.అయితే

అమెరికా అధ్యక్షుడుగా బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత మొదలు ఆయన దృష్టి మొత్తం కరోనా నివారణపైనే ఉంచారు.

ప్రతీ అమెరికన్ వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిందేనని అందరూ సహకరించాలని టార్గెట్ లు పెట్టుకుని మరీ వ్యాక్సినేషన్ వేగవంతం చేశారు.అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 70 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావాలని భావించిన బిడెన్ కు ఈ విషయంలో నిరాశ ఎదురయ్యింది.

దాంతో రెండు రోజుల క్రితం మీడియా తో మాట్లాడిన బిడెన్ సోషల్ మీడియాలో వస్తున్న అపోహ వార్తల కారణంగా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేక పోయామని అసహనం వ్యక్తం చేశారు.దాంతో

Telugu Americans, Biden, Covid, Donald Trump, Donaldtrump, Save America, Joe Bid

బిడెన్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ ఘాటుగా స్పందించారు.అమెరికా అధ్యక్షుడు, ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం లేదు కాబట్టే వ్యాక్సినేషన్ సరిగా జరగడంలేదని అన్నారు. “సేవ్ అమెరికా” వేదికగా స్పందించిన ట్రంప్ ,బిడెన్ అడ్మినిస్ట్రేషన్ పై అమెరికా ప్రజలకు నమ్మకం లేదని.2020 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై కూడా ప్రజలు ఎన్నో అనుమానం వ్యక్తం చేస్తున్నారని, ప్రస్తుతం అమెరికాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందటానికి ప్రధాన కారణం బిడెన్ అలసత్వమే అంటూ ఆరోపించారు.తమలో నమ్మకం కలిగించలేని బిడెన్ అధ్యక్షుడిగా ఉండటం అవసరమా అనుకునే పరిస్థితులు వచ్చాయని , ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube