డ్రాగన్‌కు బ్రేకులు...అమెరికాకు ప్రయోజనాలు: మిత్రుడైనా వదలనంటున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి సమకాలీన రాజకీయ నాయకులతో పోలిస్తే విభిన్నం.ఏ నిమిషానికి ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఎవరిని తిడతారో, ఎవరిని పొగుడుతారో ఆయనకు అత్యంత సన్నిహితులకు సైతం అంతుబట్టదు.

 Donald Trump Reportedly Explores Sanctions On China’s Ant Group, Donald Trump,-TeluguStop.com

ఈ క్రమంలో ఆయన తనలోని దేశభక్తుడిని, సిసలైన రాజకీయ నాయకుడిని చూపిస్తున్నారు.అమెరికాకు బద్ధ శత్రువైన చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి స్థానికులను ఆకట్టుకునేందుకు ఆయన ఓ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
వివరాల్లోకి వెళితే.చైనాకు చెందిన బడా ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ అలీబాబా గ్రూప్‌కు చెందిన ‘‘ యాంట్ గ్రూప్’’ను కట్టడి చేసేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైంది.చైనా కుబేరుడు జాక్‌మా సారథ్యంలో నడుస్తున్న ఈ సంస్థలో యాంట్ ఫైనాన్షియల్, అలీ పే కంపెనీలున్నాయి.అలీపే చెల్లింపు సేవలను, యాంట్ ఫైనాన్షియల్ సంస్థ.

టెక్నాలజీ, పేమెంట్ ప్రాసెసర్ వంటి సేవలను అందిస్తోంది.ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టార్టప్‌గా గుర్తింపు తెచ్చుకున్న యాంట్ గ్రూప్ విలువ 150 బిలియన్ డాలర్లు.

చైనాలోని మూడోంతుల మంది దీని కస్టమర్లే, ఇందులో అలీబాబాకు 33 శాతం వాటాలున్నాయి.

అలీపే త్వరలోనే షాంఘై, హాంగ్‌కాంగ్ స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్ట్ అయ్యేలా పబ్లిక్ ఇష్యూకు వెళ్లనుంది.

దీని ద్వారా సుమారు 35 బిలియన్ డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ దశలో అమెరికా పెట్టుబడిదారులు కూడా అలీపేలో ఇన్వెస్ట్ చేసే అవకాశం వుంది.ఇదే జరిగితే వారి డేటాతో పాటు అమెరికన్ బ్యాంకింగ్ వ్యవస్థకు చెందిన సమాచారం చైనా గుప్పిట్లోకి వెళ్లే అవకాశం వుందని ట్రంప్ యంత్రాంం అనుమానిస్తోంది.అందుకే ఆ సంస్థపై ఆంక్షలు విధించాలని చూస్తోంది.

ఇప్పటికే అమెరికా సహా ఐరోపా, ఇతర ప్రాంతాల్లో చైనా సంస్థ హువావేను ట్రంప్ కట్టడి చేసిన సంగతి తెలిసిందే.

తాజా ప్రతిపాదనలపై చైనా భగ్గుమంటోంది.

విదేశీ కంపెనీలను అణచివేసేందుకు అమెరికా నేషనల్ సెక్యూరిటీ లా ను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తోంది.ఒకవేళ ట్రంప్ మొండి పట్టుదలతో యాంట్ గ్రూప్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేరిస్తే ఐపీవోపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది, ఇందులో పెట్టుబడులు పెట్టేముందు ఇన్వెస్టర్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు.యాంట్ గ్రూప్‌ను ట్రంప్ టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు.2018లో అమెరికాకు చెందిన ఆర్ధిక సేవల సంస్థల మనీగ్రామ్‌ను యాంట్ గ్రూప్ కొనుగోలు చేయకుండా అమెరికా ప్రభుత్వం అడ్డుకుంది.అప్పట్లో ఈ డీల్ విలువ 1.2 బిలియన్ డాలర్లు.

అయితే అలీబాబా గ్రూప్ అధినేత జాక్‌మా.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య మొదట్లో మంచి ఫ్రెండ్‌షిప్ వుండేది.మనీగ్రామ్ వ్యవహారాన్ని అడ్డుకున్నప్పటికీ కరోనా సమయంలో పెద్ద మనసు చాటుకున్న జాక్ మా దాదాపు 1000 వెంటిలేటర్లను అమెరికాకు అందజేశారు.దీంతో నా మిత్రుడు, ప్రపంచంలోనే గొప్ప వ్యాపారవేత్త అంటూ ట్రంప్ ఆయనను ఆకాశానికి ఎత్తేశారు.

తాజాగా యాంట్ గ్రూప్ వ్యవహారం మరోసారి ఈ ఇద్దరి మధ్య దూరం పెంచే అవకాశం వుందని నిపుణులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube