ట్రంప్ మరో సంచలన నిర్ణయం..త్వరలో కీలక బిల్లు..!!!

అమెరికాలో నవంబర్ నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ సారి కూడా ఎన్నికల్లో విజయం సాధించాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు.

 Trump Eyes 'road To Citizenship' For Daca,daca, Donald Trump, Citizenship,obama-TeluguStop.com

గెలుపే లక్ష్యంగా మరో సారి అధికారాన్ని చేపట్టాలనే కోరికతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు సర్వాత్రా విమర్శలు ఎదుర్కుంటున్నాయి.అమెరికన్స్ మనస్సులో చోటు ఉంటే చాలు ఇంకేమి అక్కర్లేదని భావిస్తున్న ట్రంప్ వారి ఓట్లే కీలకంగా చేస్తున్న రాజకీయాలు అంతా ఇంతా కావనేవి ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము.

ఎన్నికలు లక్ష్యంగా చేసుకుని వర్క్ వీసాలపై ట్రంప్ మోపిన ఉక్కు పాదానికి ఎంతోమంది వలస వాసులు బలై పోతున్నారు.ఇప్పటికే వీసాల విషయంలో కటినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎంతో మంది విదేశీ వృత్తి నిపుణులను వారి వారి స్వదేశాలకి వెళ్ళేలా చేయడంలో సక్సెస్ అయిన ట్రంప్ తాజాగా మరో నిర్ణయాన్నితీసుకున్నారు.

ప్రతిభ ఆధారంగా వీసాలు మంజూరు చేసే క్రమంలో ట్రంప్ డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్ ప్రోగ్రాం ( డీఏసిఏ ) ను రద్దు చేయడాని ట్రంప్ సిద్దమయ్యారని తెలుస్తోంది.ఇంతకీ ఆ డీఏసిఏ అంటే ఏమిటంటే.

అమెరికాకి చిన్న వయసులోనే తల్లి తండ్రులతో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి చట్టపరంగా రక్షణని కల్పిస్తూ అప్పటి ఒబామా ప్రభుత్వం డీఏసిఏ రూల్ ని తీసుకువచ్చింది.అయితే ప్రతిభ ఆధారంగా విదేశీయులని తీసుకుంటామని ప్రవేశ పెట్టబోయే బిల్లులోనే ఈ డీఏసిఏ ని జతచేస్తామని ట్రంప్ ప్రకటించారు.

ఇది పౌరసత్వానికి రోడ్డు మ్యాప్ లా ఉంటుందని చెప్పిన ట్రంప్ ఈ బిల్లు వలన ఎంతో మంది సంతోషిస్తారని ప్రకటించారు.కానీ ఒబామా డీఏసిఏ ఆధారిత పిల్లలకి రక్షణగా కల్పించిన ఈ బిల్లుని ట్రంప్ రద్దు చేయాలనీ అనుకోవడం అందుకు తగ్గట్టుగా చట్టసభలో ప్రవేశపెట్టాలని అనుకోవడం ఎంతో మంది యువ వలస వాసులకి ఆందోళన కలిగిస్తోంది.అదే గనుకా జరిగితే సుమారు 6.5 లక్షల మంది యువ వలసవాసుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవ్వక తప్పదు అంటున్నారు నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube