ట్రంప్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా...!!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదవి నుంచీ తప్పుకున్న తరువాత చాలా కాలం మీడియాకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.లాక్ డౌన్ వలన నష్టపోయిన తన వ్యాపారాలను మళ్ళీ గాడిలో పెట్టేందుకు ట్రంప్ కొంత కాలం యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నా, 2024 లో పోటీ చేసేందుకు సిద్దం అంటూ ప్రకటించుకుని ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విమర్సల బాణాలు సందిస్తూనే ఉన్నారు.

 Donald Trump Republican Party Leaders Fund Raising Committee-TeluguStop.com

అయితే ట్రంప్ పై ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా లు నిషేధం విధించడంతో ట్రంప్ కార్యక్రమాలు ప్రజలకు చేరువ అవ్వడంలేదు.ఈ కారణంగా ట్రంప్ కు ప్రజలలో ఉన్న క్రేజ్ తగ్గుతుందని డెమోక్రటిక్ పార్టీ కూడా అంచనా వేసింది.కానీ

ఊహించని విధంగా ట్రంప్ కు ఉన్న ఫాలోయింగ్ పెరుగుతోంది.అధ్యక్ష పదవిలో ఉన్నా లేకపోయినా ట్రంప్ ను అనుసరించే వారి సంఖ్య ఎక్కువే అందుకే ట్రంప్ సొంతగా సోషల్ మీడియా ను సృష్టించుకున్నారు.

 Donald Trump Republican Party Leaders Fund Raising Committee-ట్రంప్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ట్రంప్ కు ప్రజలలో ఉన్న ఖలేజా మరో సారి రుజువయ్యింది.ట్రంప్ అధ్యక్షుడిగా లేని తరువాత కూడా ట్రంప్ కోసం నిధులు ఇవ్వడంలో ఆయన అభిమానులు వెనుకాడటం లేదు.

కేవలం ఆరునెలల కాలంలో రిపబ్లికన్ పార్టీ కి అలాగే ట్రంప్ ఆధ్వర్యంలో నడిచే ఫండ్ రైజింగ్ కమిటీలకు విరాళాలు వెల్లువెత్తాయి.

ట్రంప్ కు చెందిన ఫండ్ కమిటీలకు ఆరు నెలలో కాలంలో మొత్తం 56 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దీని విలువ రూ.417 కోట్లు) విరాళాలుగా అందాయట.రిపబ్లికన్ పార్టీ కోసం ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కమిటీ ఈ నిధులు సేకరిస్తుంది.

అలాగే ట్రంప్ సొంత ఫండ్ రైజింగ్ కమిటీ కూడా నిధులను సేకరిస్తుంది.ఈ కమిటీల ద్వారా తాజాగా 22 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.164 కోట్లు ) నిధులు అందాయట.ఈ మొత్తం విరాళాలు చూసిన ట్రంప్ వ్యతిరేకులు ట్రంప్ అధికారంలో లేకపోయినా ఇంత క్రేజ్ ఏంటో అంటూ నోళ్ళు వెళ్ళ బెడుతున్నారట.

రిపబ్లికన్ పార్టీ ట్రంప్ ను 2024 కు అధ్యక్ష అభ్యర్ధిగా ప్రకటించడానికి వెనుకాడినా ప్రస్తుతం ఆయనకు ఉన్న క్రేజ్ తో మళ్ళీ ట్రంప్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.

.

#DonaldTrump #Donald Trump #RepublicanParty #FundRaising

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు