ట్రంపూ మరీ ఇంత దారుణమా..జడ్జి పైనే విమర్శలా..!!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరి రోజు రోజుకి చిత్ర విచిత్రంగా మారుతోంది.ఎన్నికల్లో తాను ఓటమిపాలైనా గెలిచింది తానె అంటూ ప్రకటించుకోవడం, ఓట్లు లెక్కించాలంటూ కోర్టులకెక్కడం ట్రంప్ విచిత్ర వైఖరికి అద్దం పడుతాయి.

 Donald Trump About Recounting In Pennsylvania Court, Pennsylvania Court, Donald-TeluguStop.com

జార్జియా లో ఓట్లు లెక్కించాలని ట్రంప్ అభ్యర్ధన మేరకు ఎన్నికల కమిషన్ అక్కడ మళ్ళీ రీ కౌంటింగ్ చేపట్టగా అక్కడ మరలా బిడెన్ కి అనుకూలంగా రిజల్ట్స్ రావడం అందరికి తెలిసిందే.అయితే

పెన్సిల్వేనియా లో కూడా రీ కౌంటింగ్ చేయాలని, అక్కడ తమకు అనుకూలంగా ఓట్లు వస్తాయని ట్రంప్ వర్గం కోర్టులో వేసిన పిటిషన్ ని పెన్సిల్వేనియా కోర్టు కొట్టిపారేసింది.

పోలింగ్ లో అక్రమాలు జరిగాయని ఎలాంటి ఆధారాలు లేవని అలాంటప్పుడు ఎక్కడ తప్పుజరిగిందని పిల్ వేయడం మంచిది కాదని చివాట్లు పెట్టింది.గతంలో ట్రంప్ పెన్సిల్వేనియా లో ఊహించని మేజారిటీ సాధించారు కానీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం అక్కడి ఓటర్లు ట్రంప్ ని పెద్దగా ఆదరించలేదు.

దాంతో ట్రంప్ మరో సారి రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.కానీ

పెన్సిల్వేనియా రాష్ట్రంలో సుమారు 70 లక్షల ఓట్లు ఉన్నాయని ఇవన్నీ చెల్లవని చెప్పడం సమంజసం కాదని, తగిన ఆధారాలు ఉంటే తప్పకుండా పరిశీలిస్తామని జడ్జి మాధ్యూ తెలిపారు.

అయితే ఈ తీర్పుపై స్పందించిన ట్రంప్ అటార్నీ గిలియానీ ఇలాంటి తీర్పు ఇవ్వడం సరైనది కాదని దీనిపై తాము పై కోర్టుకు వెళ్తామని తెలిపారు.అసలు ఆధారాలు పరిశీలించకుండానే తీర్పు ఎలా చెప్తారని మండిపడ్డారు.

సదరు జడ్జి ఒబామా హయాంలో నియమింపబడిన జడ్జి అని విమర్శలు చేశారు.అయితే జడ్జి తీర్పుని తప్పు బట్టడం మంచిది కాదని , కోర్టుల తీర్పులను గౌరవించే వ్యక్తిత్వం ట్రంప్ కి లేదని ట్రంప్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube