భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎ మాత్రం భాగోలేదు! ట్రంప్ వాఖ్యలు!  

  • పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దారుణంగా వున్నాయని, ఎన్నడూ లేనంత క్రిటికల్ సిచువేషన్స్ రెండు దేశాల మధ్య నెలకొని వున్నాయని, ఇవి మరింత ముదిరితే శాంతి సమస్యలు తలెత్తే అవకాశాలు వున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వాఖ్యల్లు చేసారు. అమెరికాలో తన అధికార బృందంతో మాట్లాడిన ట్రంప్ ముఖ్యంగా పుల్వామా ఎటాక్స్ గురించి ప్రస్తావిస్తూ, పాకిస్తాన్ లో వున్నా జైషే మహ్మద్ సంస్థ చేసిన ఈ ఆత్మాహుతి దాడి కారణంగా ఇండియా ప్రతీకారంతో రగిలిపోతుంది అని, పాకిస్తాన్ పై ఏదో ఒక విధంగా దాడులు చేయడానికి సిద్ధం అవుతుందని ట్రంప్ వాఖ్యలు చేసారు.

  • పాకిస్తాన్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతుందని, ఇది రెండు దేశాలకి అంత మంచి వాతావరణం కాదని, తక్షణం రెండు దేశాల ప్రతినిధులతో మాట్లాడి పరిస్థితులని మెరుగుపరిచే ప్రయత్నం మొదలెట్టాలని అమెరికన్ ప్రభుత్వ ప్రతినిధులకి ట్రంప్ సూచనలు చేసారు. ఇదే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడితే దానిని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదని చాలా ప్రాణ నష్టం జరుగుతుందని, ఈ విషయంలో పాకిస్తాన్ కి ఎక్కువ నష్టం జరిగే అవకాశం వున్నా నేపధ్యంలో దౌత్యపరమైన సంబంధాలు చెడిపోకుండా రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పాటు అయ్యే పని మొదలెట్టాలని ట్రంప్ అమెరికన్ దౌత్య అధికారులకి ఆదేశాలు జారీ చేసారు.