Donald Trump: ‘‘ నేను గెలిస్తే.. మీ తుపాకులను ఎవరూ టచ్ చేయలేరు ’’ : గన్ కల్చర్‌ను సమర్ధించేలా ట్రంప్ వ్యాఖ్యలు

అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్( Gun culture ) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.

 Donald Trump Promises To Be The Best Friend Gun Owners Have Ever Had In The Whi-TeluguStop.com

జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.

ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.

Telugu Donald Trump, Drug, Florida School, Gun, Gun Owners, Joe Biden, Problems,

ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) సంచలన వ్యాఖ్యలు చేశారు.అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే .మీ తుపాకులను ఎవరూ టచ్ చేయలేరని అన్నారు.అమెరికా జాతీయ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ) సభ్యులకు ట్రంప్ ఈ మేరకు హామీ ఇచ్చారు.శుక్రవారం పెన్సిల్వేనియాలోని హారిస్‌బర్గ్‌లో జరిగిన ఎన్ఆర్ఏ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.

తన హయాంలో తుపాకీ నియంత్రణ చర్యలను అమలు చేయడానికి ఎలాంటి ఒత్తిడి వచ్చినా తాను ప్రతిఘటించానని పేర్కొన్నారు.వైట్‌హౌస్‌లో తుపాకీ యజమానులకు బెస్ట్ ఫ్రెండ్ తానేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Telugu Donald Trump, Drug, Florida School, Gun, Gun Owners, Joe Biden, Problems,

కాగా.ట్రంప్ గన్ కల్చర్‌కు అనుకూలంగా మాట్లాడటం ఇదే తొలిసారి కాదు.గతేడాది ఇండియానాపోలిస్‌లో జరిగిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ)వార్షిక సమావేశంలో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు.సామూహిక కాల్పుల ఘటనలకు తుపాకీలు ఒక్కటే కారణం కాదన్నారు.దీనికి మానసిక సమస్యలు, డ్రగ్స్ వినియోగం, నేర ప్రవృత్తే కారణమని ట్రంప్ అన్నారు.సామూహిక కాల్పుల ఘటనల్లో 2006 నుంచి 3000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

తుపాకీ నియంత్రణ చట్టాల కోసం డెమొక్రాట్‌లు పలుమార్లు ప్రతిపాదించగా ట్రంప్ వ్యతిరేకించారు.మరోవైపు.

ఫ్లోరిడాలోని హైస్కూల్‌లో 17 మందిని పొట్టనబెట్టుకున్న పార్క్‌లాండ్ మారణకాండ వచ్చే వారం ఆరవ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది.అధ్యక్షుడిగా పార్క్‌లాండ్ ఇతర తుపాకీ ఘటనలపై ట్రంప్ స్పందించిన తీరుపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి.

తుపాకులపై ఆయన పాలనా యంత్రాంగం తీసుకున్న ఏకైక కీలక చర్య.బంప్ స్టాక్‌లను నిషేధించడం.

సెమీ ఆటోమేటిక్ ఆయుధాలను మెషిన్ గన్‌ల వలె కాల్చడానికి వీలు కల్పించే పరికరాలనే బంప్ స్టాక్‌లు అంటారు.అక్టోబర్ 2017లో లాస్ వెగాస్‌లో 58 మందిని చంపిన ముష్కరుడు బంప్ స్టాక్‌లను ఉపయోగించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube