ట్రంప్ అభివృద్ధి గేలానికి..అమెరికా ప్రజలు చిక్కేనా...?

2020 న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ రిపబ్లికన్ పార్టీ గెలుపొందుతుందా, ట్రంప్ అధికారంలోకి వస్తాడా అనే చర్చ ఒకవైపు జరుగుతుంటే, ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలుపొంది తీరాల్సిందేనంటూ డెమోక్రాట్లు వ్యుహరచనలు చేస్తున్నారు.ఒక రకంగా చెప్పాలంటే ఇరు పార్టీలకి అమెరికాలో సమానంగా ప్రజాదరణ ఉంది ట్రంప్ పై పూర్తిగా వ్యతిరేకత లేదు.

 Donald Trump Promises Campaign At North Carolina-TeluguStop.com

అలా అని పూర్తిగా ట్రంప్ కి మళ్ళీ పదవి కట్టబెట్టాలని అమెరికన్స్ సిద్దంగా లేరట.ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ పై ప్రజలు సానుకూలంగా ఉన్నారని అంటున్నాయి సర్వేలు.

ఈ క్రమంలోనే

ఒక వైపు డెమోక్రటిక్ పార్టీ, మరొక వైపు రిపబ్లికన్ పార్టీలు రెండూ ప్రచారంలో పోటీ పడుతున్నాయి.ట్రంప్ చేసిన తప్పులని ఎత్తి చూపుతూ తామేమి చేస్తామో హామీ ఇస్తున్న డెమోక్రాట్లు ఒకవైపు.

తాను చేసిన ప్రతీ పని అమెరికా అభివృద్దిలో భంగమే అంటూ ప్రజలలో సెంటిమెంట్ రాగుల్చుతూ దూసుకుపోతున్న ట్రంప్ ఇలా అమెరికాలో ప్రచార కోలాహలం ఊపందుకుంది.రిపబ్లికన్ పార్టీ బరి నుంచీ ట్రంప్ అభ్యర్ధిగా ఉండగా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ నార్త్ కరోలినాలో ప్రజలని ఉద్దేశించి ప్రసంగించారు.కాదు కాదు అమెరికా ప్రజలకి అభివృద్ధి పేరుతో గేలం వేసే ప్రయత్నం చేశారు

Telugu Presidential, Promises, Donald Trump, Carolina-

ట్రంప్ ప్రచారంలో వారాల జల్లులు కురిపించడమే కాకుండా దేశంలో ఉన్న అన్ని నగరాలు, పట్టణాలకి సమాన ప్రాధ్యాన్యతని ఇస్తానని ప్రకటించారు.గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలవలన అమెరికా అభివృద్ధికి ప్రజలకి నష్టాన్ని తెచ్చేలా ఉంది కాబట్టి వాటిలో కొన్నిటిని రద్దు చేశానని తెలిపారు.అంతేకాదు చైనా అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారనుందని అందుకే తాను నూతన సంస్కరణలు చేపడుతున్నానని వీటివలన అమెరికా అత్యంత బలమైన దేశంగా మరింత దూసుకుపోతుంది అంటూ తనదైన శైలిలో ప్రసంగం చేశారు.అమెరికాని మహోన్నతమైన దేశంగా తీర్చి దిద్దటమే తన లక్ష్యమని చెప్తున్నా ట్రంప్ గేలానికి అమెరికా ప్రజలు చిక్కుతారో లేక డెమోక్రటిక్ పార్టీకి ఈ సారి పట్టం కడుతారో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube