వైరల్ వీడియో : పాటగా మారిన ట్రంప్, బిడెన్ డిబేట్..!

యూట్యూబ్ లో కొన్ని పాటలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడం చాలానే చూశాం.అయితే అమెరికాకు చెందిన యూట్యూబర్ కు కామెడీ పంచే అలవాటు కాస్త ఎక్కువ.

 Donald Trump And Joe Biden Presidential Debate, Viral Video, Trump , Biden, Yout-TeluguStop.com

దీంతో తాజాగా ఆయన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.ఇక ఈయన వీడియో చేయడానికి అమెరికాలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన ట్రంప్, బిడెన్ ల మధ్య జరిగిన సీరియస్ డిబేట్ ని కూడా ఆయన కామెడీ చేసాడు.

ఆయన చేసిన కామెడీకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.ఇకపోతే ప్రస్తుతం ప్రపంచం మొత్తం అమెరికాను చూస్తోంది.

ఇందుకు చాలానే కారణాలు ఉన్నాయి.అందులో మొదటిది కరోనా వైరస్.

తర్వాతది అమెరికా అధ్యక్షునికి కరోనా పాజిటివ్ రావడం.అలాగే మరో విషయం అమెరికాలో రాబోయే అధ్యక్ష ఎన్నికల గురించి.

వీటితోపాటుగా తాజాగా జరిగిన డోనాల్డ్ ట్రంప్, బిడెన్ ల మధ్య జరిగిన డిబేట్ లో ట్రంప్ కన్నా బిడెన్ ఓ మెట్టు పైనే నిలవడమే.

ఇలా అనేక విషయాలు ప్రస్తుతం ప్రపంచం మొత్తం అమెరికా వైపు చూసేలా చేస్తున్నాయి.

వీటిలో అన్నిటికన్నా ముఖ్యంగా నవంబర్ 3న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న అంశంపై చాలా మంది విశ్లేషకులు రకరకాల విశ్లేషణలు చేపడుతున్నారు.అంతేకాదు ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ కు కరోనా తగ్గకపోతే తర్వాత పరిస్థితి ఏంటనే కొత్త విశ్లేషణలు కూడా చేపడుతున్నారు కొందరు.

ట్రంప్ కి ఒకవేళ ఏమైనా అయితే ఉపాధ్యక్షుడికి బాధ్యతలు అప్పగిస్తారా లేకపోతే కొత్త నాయకుని ఎన్నుకుంటారా అని చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ఇక ఈ విషయాలు పక్కన పెడితే… తాజాగా ట్రంప్, బిడ్డెన్ ల ప్రెసిడెన్షియల్ డిబేట్ కు ఓ యూట్యూబ్ ఛానల్ చెందిన వ్యక్తి సీరియస్ గా సాగిన ఆ డిబేట్ ను కాస్త పూర్తిగా కామెడీ చేశాడు.

అమెరికా దేశానికి చెందిన సాంగ్ రైటర్ కం మ్యూజిషియన్ వియర్డ్ అల్ యంకోవిక్ అనే వ్యక్తి ఈ కొత్త వీడియోను డిజైన్ చేశాడు.తానే ఈ డిబేట్ ను నిర్వహిస్తున్న విధంగా మధ్య మధ్యలో కామెడీని పాటల రూపంలో మాట్లాడాడు.

ఇలా అనేక అంశాలపై ఆయన మాట్లాడుతూ చివరికి నెటిజన్స్ కి మాత్రం కడుపుబ్బా కామెడీని పంచాడు.ఇక ఆ వీడియోలో వాడిన ట్యూన్స్, బీట్స్ అమాంతం నచ్చేశాయి.

ఇక ఈ వీడియోకి ‘ వుయ్ ఆర్ ఆల్ డూమ్డ్ ‘ అనే టైటిల్ పెట్టి యూట్యూబ్ లో విడుదల చేశాడు.ఇక్కడ ఆయన మాత్రమే పాటల రూపంలో ప్రశ్నలు అడిగాడు అనుకుంటే పొరపాటే.

ట్రంప్, బిడెన్ లు కూడా చెప్పే సమాధానాలు పాటలు రూపంలోనే సాగుతుండడంతో ఈ వీడియో కాస్త బాగా వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి కడుపుబ్బా నవ్వుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube