భారత్ కరోనా మరణాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..?  

Donald trump Sensational Comments on Corona Deaths in India, India, Corona deaths, Donald trump, Joe Biden, Presidential Debate - Telugu China, Corona Deaths, Donald Trump, Donald Trump Sensational Comments On Corona Deaths In India, India, Jo Biden, Joe Biden, Presidential Debate, Russia

మార్చి నెల తొలి వారం నుంచి భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే.దేశంలో ఒకానొక సమయంలో 90,000కు పైగా కేసులు నమోదు కాగా గతంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి.

TeluguStop.com - Donald Trump Presidential Debate India Corona Deaths

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ క్రమంగా అదుపులోకి వస్తోంది.హోం ఐసోలేషన్ లోనే 85 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటూ ఉండటం గమనార్హం.

వైరస్ విజృంభించిన తొలినాళ్ల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసుల గురించి, మరణాల గురించి సరైన లెక్కలు చెబుతూ ప్రజలకు అప్రమత్తం చేస్తున్నాయి.అయితే భారత్ కరోనా మరణాల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతోందంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

TeluguStop.com - భారత్ కరోనా మరణాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..-General-Telugu-Telugu Tollywood Photo Image

భారత్ పై ఈ తరహా ఆరోపణలు వ్యక్తం కావడం ఇదే తొలిసారి.కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ విశ్వవిద్యాలయం దగ్గర అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డెమొక్రాటిక్‌ అభ్యర్ధి జో బిడెన్ మధ్య జరిగిన మాటల యుద్ధంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జో బిడెన్ మాట్లాడుతూ అమెరికాలో 70 లక్షలకు పైగా కరోనా కేసులు, 2 లక్షలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయని.ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే కరోనా మహమ్మారిని కట్టడి చేయకపోతే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించానని.

ట్రంప్ కరోనా విషయంలో సరైన ప్రణాళిక వేసుకోకపోవడం వల్లే ఈ స్థాయిలో కేసులు , మరణాలు నమోదయ్యాయని వెల్లడించారు.

కరోనా వల్ల అమెరికన్లు ప్రాణాలు కోల్పోవడానికి ట్రంప్ కారణమని అన్నారు.

బిడెన్ చేసిన వ్యాఖ్యల గురించి ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.చైనా తప్పిదం వల్ల కరోనా వ్యాప్తి చెందిందని.

ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చర్యల వల్లే తక్కువగా మరణాలు నమోదయ్యాయని.భారత్, రష్యా, చైనా కరోనా మరణాల విషయంలో సరైన లెక్కలు చెప్పలేదని అన్నారు.

త్వరలో కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.భారత్ పై ట్రంప్ నిరాధారమైన ఆరోపణలు చేయడం గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

#Jo Biden #Joe Biden #Russia #China #DonaldTrump

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Donald Trump Presidential Debate India Corona Deaths Related Telugu News,Photos/Pics,Images..