ట్రంప్ మరో సంచలన నిర్ణయం...!!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చేసినా కాస్త వెరైటీగా, వివాదాస్పదంగానే ఉంటుంది.సహజంగానే సంచలన నిర్ణయాలు తీసుకునే ట్రంప్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరిన్ని సంచలనాత్మకమైన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.

 Donald Trump Bars Outsourcing Jobs For Foreign Workers, Donald Trump , Americans-TeluguStop.com

ఇప్పటికే వలసవాసులపై తాత్కాలిక నిషేధం విధించిన ట్రంప్ అమెరికాలోకి రావడానికి ఇప్పట్లో గేట్లు తెరిచే అవకాశం లేదని చెప్పేశారు.ఇక ఎన్నికలు వాయిదా పడాలని ఒక సారి కాదు కాదు అంటూ మరొకసారి తనకే తెలియని భ్రమలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

అయితే ఇప్పటి వరకూ ట్రంప్ తీసుకున్న చర్యలు అన్నీ అమెరికన్స్ కి లబ్ది చేకూర్చేలా ఉన్నాయనేది అక్షర సత్యం…ఇదిలాఉంటే

ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఉపాది కోసం విదేశాలకి వెళ్లాలని అనుకునే ఎంతో మందికి షాక్ ఇచ్చారు.

అమెరికాలో ప్రభుత్వ సంస్థలలో, కాంట్రాక్ట్, ఔట్సొర్సింగ్ విధానం ద్వారా పనిచేస్తున్న విదేశీయులకి హ్యాండ్ ఇచ్చి అమెరికన్స్ తో ఆ ఉద్యోగాలు భర్తీ చేయడానికి సిద్దమయ్యారు.అమెరికాలో కాంట్రాక్ట్, ఔట్సొర్సింగ్ ఉద్యోగాలు కేవలం అమెరికన్స్ కి మాత్రమే ఇచ్చేలా కొత్త నిభంధనలు తీసుకువచ్చారు.

Telugu Americans, Donald Trump, Donaldtrump, Lockdown Effect-

ట్రంప్ తాజా నిభందన ప్రకారం ఈ ఉద్యోగాలలో అమెరికన్స్ ని, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ని తీసేయకూడదని స్పష్టం చేశారు.ఈ మేరకు ఈ కీలక ఉత్తర్వులపై సంతకం చేశారు.అమెరికాలో ఉంటున్న వలస వాసులు ఎంతోమంది కాంట్రాక్ట్, ఔట్సొర్సింగ్ ఉద్యోగాలలో ఉంటున్నారని, కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది అమెరికన్స్ కి న్యాయం చేయాలంటే ఈ నిభందన పాటించక తప్పదని తెలిపారు.రోజు రోజుకి అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోవడంతో ఈ నిభందన చేయక తప్పలేదని అంటున్నారు అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube