ట్రంప్ పైత్యం.. ఆ హత్యలకి కారణం అవేనాట..!!!

అమెరికాలో గత కొన్ని నెలలుగా జరిగిన మారణకాండకి కారణం ఏమిటో ట్రంప్ చెప్పేశారు.అమెరికా వ్యాప్తంగా చర్చిలు , పలు ప్రదేశాలు , స్కూల్స్ లో, హోటల్స్ ఇలా రకరకాల ప్రదేశాలలో దుండగులు, లేదా యువకులు కాల్పులకి తెగబడిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

 Donald Trump On Video Games-TeluguStop.com

ఈ దాడులలో ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు కూడా.అయితే వీటన్నిటికీ ఒకటే కారణం అంటూ ట్రంప్ మరో సారి తన తెంపరి తనాన్ని చాటి చెప్పారు.

ట్రంప్ పైత్యం ఆ హత్యలకి కారణ�

ఇలాంటి హింసాత్మక ఘటనలకి కారణం కేవలం వీడియో గేమ్స్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.ట్రంప్ తో పాటు హౌస్‌ మైనార్టీ నాయకుడు కెవిన్‌ మెక్‌క్రాథీ పేర్కొన్నారు.ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాలు మండిపడుతున్నారు.తుపాకుల సంస్కృతి హెచ్చు మీరుతుంటే అందుకు కట్టడిగా బిల్లుని పాస్ చేయాలని చూస్తున్న తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఈ బిల్లు అమలయ్యే అవకాశాలని దెబ్బ కొట్టేవిధంగా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు తిట్టి పోస్తున్నారు.

అమెరికా వ్యాప్తంగా హింసాత్మక వీడియో గేమ్ లు ఆడకుండా కట్టడి చేస్తామని ట్రంప్ చెప్పడంతో ఈ వ్యాఖ్యలపై హిల్లరీ క్లింటన్ స్పందించారు.ఇతర దేశాలలో ఎంతో మంది మానసికంగా భాధలు పడుతున్నారు.

అక్కడ కూడా వీడియో గేమ్స్ ఆడుతున్నారు.కానీ అక్కడికి ఇక్కడికి తేడా మాత్రం ఒక్కటే తుపాకులు అంటూ చురకలు అంటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube