ట్రంప్ గారి నోట మరోసారి కాశ్మీర్ మాట,ఖండించిన భారత్!  

Donald Trump Offers Mediate On Kashmir Issue -

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోట మరోసారి కాశ్మీర్ మాట వచ్చింది.కాశ్మీర్ అంశం పై ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించాలని అనుకుంటున్నట్లు మరోసారి మీడియా ముందు చెప్పారు.

Donald Trump Offers Mediate On Kashmir Issue

గతంలో కూడా కాశ్మీర్ అంశం పై మధ్యవర్తిత్వం చేయమని మోడీ కోరారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పటిలో తీవ్ర దుమారం రేపాయి.అయితే ఇప్పుడు మరో సారి అక్కడి మీడియా తో మాట్లాడుతూ కాశ్మీర్ అంశం పై మధ్యవర్తిత్వం వహిస్తాను అంటూ మరోసారి వ్యాఖ్యలు చేశారు.

మరో పక్క ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇండియా ఖండించింది.కాశ్మీర్ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని గతంలోనే స్పష్టం చేశామని, ఏదున్నా కాశ్మీర్ అంశం పై భారత్,పాకిస్థాన్ ల మధ్య మాత్రమే చర్చలు ఉంటాయి అని మరోసారి స్పష్టం చేసింది.

ట్రంప్ గారి నోట మరోసారి కాశ్మీర్ మాట,ఖండించిన భారత్-General-Telugu-Telugu Tollywood Photo Image

వైట్ హౌస్ లో ట్రంప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇండియా,పాక్ కోరితే కాశ్మీర్ అంశం పై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యలు చేయడం మరో సారి సంచలనం గా మారింది.మరి ఇన్ని సార్లు భారత్ స్పష్టం చేస్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం పదే పదే ఇదే అంశం పై వ్యాఖ్యలు చేయడం విశేషం.మరి ట్రంప్ గారికి ఎందుకో కాశ్మీర్ పై అంత మక్కువ.

తాజా వార్తలు

Donald Trump Offers Mediate On Kashmir Issue- Related....