కొత్త నినాదంతో దూసుకుపోతున్న ట్రంప్…!!!  

Donald Trump New Attack at Nevada Rally, If Biden wins China wins, Donald Trump, America Elections Campaign, Nevada Rally - Telugu America Elections Campaign, Donald Trump, Donald Trump New Attack At Nevada Rally, If Biden Wins China Wins, Nevada Rally

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది పరస్పర రాజకీయ వాడి వేడి వ్యాఖ్యలు జోరందుకున్నాయి.అధికారం కోసం డెమోక్రటిక్ పార్టీ, అధికారాన్ని జేజార్చుకోకుండా పట్టు పడుతున్న రిపబ్లికన్ పార్టీ రెండూ హోరా హోరీ గా పోటీలు పడుతున్నాయి.

TeluguStop.com - Donald Trump New Attack Joe Biden China Wins Nevada Rally

ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్ధులు పదునైన వ్యాఖ్యలతో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు.ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ట్రంప్ ని మించిన నాయకుడు లేడనే చెప్పాలి.

సెంటిమెంట్ ని జోడించి, రంగరించి ప్రజల్లోకి పంపడంలో ట్రంప్ తలపండిన వ్యక్తే.

TeluguStop.com - కొత్త నినాదంతో దూసుకుపోతున్న ట్రంప్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ట్రంప్ తనకి పట్టున్న రాష్ట్రాలలో ముందుగా ప్రచారాన్ని నిర్వహించాలని భావించారు.

అందుకు తగ్గట్టుగా నెవాడా, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, ఆరిజోనా, కాలిఫోర్నియా వంటి పలు ప్రాంతాలలో పర్యటనలు చేస్తూ ప్రజలని తనదైన వ్యాఖ్యలతో ఉత్తేజపరిస్తున్నాడు.పలు పర్యటనలలో తన ప్రత్యర్ధి అభ్యర్ధి బిడెన్ పై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు అమెరికన్స్ ని ఆకట్టుకున్తున్నాయట.

అంతేకాదు తాజాగా ట్రంప్ చేస్తున్న నినాదం అమెరికన్స్ పై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.ఇంతకీ ట్రంప్ నినాదం ఏంటంటే.

అమెరికాలో నవంబర్ 3 న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క అమెరికన్ అలాగే అమెరికాని ప్రేమించే వాళ్ళు , వలస వాసులు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి.

అమెరికన్స్ ని చైనా ఏలాలంటే బిడెన్ కి ఓటు వేయండి, లేదు అమెరికన్స్ ని అమెరికన్ ఏలాలంటే నాకు ఓటు వేయండి, ట్రంప్ గెలిస్తే అమెరికా గెలిచినట్టే, బిడెన్ గెలిస్తే చైనా గెలిచినట్టేనంటూ సెంటిమెంట్ రగిల్చారు.ఈ వ్యాఖ్యలు చేసిన వెంటంటే ట్రంప్ మద్దతు దారులు ట్రంప్ కాబోయే ప్రెసిడెంట్ అంటూ నినాదాలు చేశారు.

#Donald Trump #IfBiden #DonaldTrump #Nevada Rally

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Donald Trump New Attack Joe Biden China Wins Nevada Rally Related Telugu News,Photos/Pics,Images..