మోడీ కి షాక్ ఇచ్చిన ట్రంప్..!

అమెరికాలో త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపధ్యంలో ఇరు పార్టీలు ఎన్నికల యుద్దానికి సంసిద్దంగా ఉన్నారు.

 Donald Trump Using Modi Photo For Election Campaign, Pm Modi, Trump, America Pre-TeluguStop.com

గెలుపా ఓటమా అన్న రీతిలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు అలుపెరుగకుండా తలపడుతున్నాయి.ఇక అమెరికన్స్ ఓట్ల గురించి ఎవరికి వారు ధీమాగానే ఉన్నా, వలస వాసుల ఓట్లు మాకు పడతాయంటే మాకు పడతాయంటూ గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

అత్యధిక మెజారిటీ ఓట్లుగా ఉన్న భారతీయుల ఓట్లు ఇప్పుడు అమెరికాలో కీలకం కానున్నాయి.ఈ ఓట్లని ఆకర్షించడానికి బిడెన్ కమలా హారీస్ కి ఉపాధ్యక్ష పదవిని అప్పగిస్తే ట్రంప్ ఏకంగా మోడీ తో ప్రచారాన్ని ప్రారభించారు.

ఇప్పుడు ఇదే మోడీ కి ఇబ్బందికర పరిణామంగా మారింది.ఎందుకంటే.

అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల నేపధ్యంలో అక్కడి పరిస్థితులని గమనించిన బీజేపీ పెద్దలు మోడీ దృష్టికి పలు విషయాలను తీసుకువెళ్ళడంతో అమెరికాలో ఉండే బీజేపీ నేతలు ఎవరూ కూడా ఏ పార్టీకి మన జెండాతో మద్దతు ఇవ్వద్దని ఆదేశాలు జారీ చేశారు.ఎవరైనా సరే వ్యక్తిగతంగా మద్దతు ఇవ్వాలి కానీ పార్టీ జెండాతో ,కండువాతో కానీ మద్దతు ఇస్తే ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేసింది.

దాంతో అమెరికాలో ఉన్న బీజేపీ నేతలు అధిష్టానం ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని తెలిపారు.ఇదిలాఉంటే

మోడీ నాకు మంచి స్నేహితుడు, భారత్ అంటే నాకు ఎంతో అభిమానం, ప్రేమా ఉన్నాయంటూ ట్రంప్ నేరుగా మోడీ ఫోటోని వాడేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం మోడీ , ట్రంప్ ల స్నేహానికి గుర్తుగా ఉన్న వీడియోలను బిగ్ స్క్రీన్స్ పై వేస్తూ భారతీయ ఓటర్లని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేసిన ట్రంప్ తాజాగా రిపబ్లికన్ పార్టీ క్యాంపైన్ లో మోడీ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తున్నాడు.ఒక పక్క అమెరికాలో ఉన్న భారతీయ జనత పార్టీ నేతలకి ఏ పార్టీకి సైతం జెండాతో మద్దతు ఇవ్వంద్దంటూ ఆదేశాలు వెళ్తుంటే మరో పక్క ట్రంప్ ఏకంగా మోడీనే ప్రచారానికి వాడేసుకోవడంతో ట్రంప్ మోడీ కి షాక్ ఇచ్చినట్టయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube