జిమ్మీకార్టర్‌ను జిమ్మీ కానర్స్‌‌గా పలికిన ట్రంప్.. ఆడుకుంటున్న నెటిజన్లు

అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన జో బైడెన్ ,( Joe Biden ) డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఇద్దరూ పెద్ద వయస్కులే .

బైడెన్ ఆల్రెడీ 80 క్రాస్ చేయగా.

ట్రంప్‌కు 77 ఏళ్లు.ఈ వయసులోనూ రాజకీయాలు చేస్తున్నప్పటికీ .వీరిద్దరిని వయోభారం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.మతిమరుపు, కంగారు, అనారోగ్య సంస్యలను వారు ఎదుర్కొంటున్నారు.

ఇద్దరిలోనూ బైడెన్‌లో సమస్య కాస్త ఎక్కువగా వుంది.అయితే ట్రంప్ కూడా ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి చేరినట్లుగా వుంది.

ఇటీవల ఆయన తన ప్రసంగంలో టెన్నిస్ దిగ్గజం జిమ్మీ కానర్స్‌ను( Jimmy Connors ) అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌గా( Jimmy Carter ) పిలిచారు.న్యూజెర్సీలోని వైల్డ్‌వుడ్‌లో ఇటీవల జరిగిన ర్యాలీలో బైడెన్‌ను విమర్శిస్తూ ట్రంప్ ఈ పేరును ప్రస్తావించారు.

Advertisement

బైడెన్‌తో పోల్చితే కార్టర్ అసాధారణమైన నేత , తెలివైన వ్యక్తిగా ఆయన అభివర్ణించారు.

అయితే వీరిద్దరిని పోల్చి చెబుతున్నప్పుడు జిమ్మీ కార్టర్‌ను జిమ్మీ కానర్స్ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ట్రంప్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.దీంతో నెటిజన్లు ట్రంప్‌పై సెటైర్లు వేస్తున్నారు.

ఎవరైనా ఈ రెండింటిని ఎలా కలపగలరు.జిమ్మీ కార్టర్ అమెరికాకు 39వ అధ్యక్షుడు, జిమ్మీ కానర్స్ ఓ అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ అని ఓ ఎక్స్ యూజర్ కామెంట్ చేశారు.

జిమ్మీ కానర్స్ తెలివైన టెన్నిస్ ప్లేయర్( Tennis Player ) మరి అధ్యక్షుడు ఎప్పుడు అయ్యాడు అని మరో యూజర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.న్యూజెర్సీలో( New Jersey ) జరిగిన ర్యాలీలో బైడెన్‌ను మూర్ఖుడు అని అభిర్ణించారు ట్రంప్.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

మన దేశ చరిత్రలో అత్యంత చెత్త 10 మంది అధ్యక్షులను తీసుకుంటే .బైడెన్ చేసిన నష్టం వారెవ్వరూ చేయలేదన్నారు.అతను ఓ మూర్ఖుడని, తెలివైన వాడు కాదని ట్రంప్ ఎద్దేవా చేశారు.

Advertisement

కాగా.రాజ్యాంగం కోసం జైలుకు వెళ్లడం చాలా గర్వంగా వుంది ’’ అంటూ ఇటీవల వ్యాఖ్యానించారు డొనాల్డ్ ట్రంప్.హుష్ మనీ ట్రయల్ .( Hush Money Trial ) మూడవ వారం విచారణ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా ఏదైనా ప్రస్తావించబడితే.

వారు ఎవరో మీకు తెలిస్తే.అతను నన్ను జైలులో పెట్టాలనుకుంటున్నాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

అది ఏదో ఒక రోజు జరుగుతుందని.కానీ మన రాజ్యాంగం కోసం జైలుకు వెళ్లడం చాలా గర్వంగా వుంటుందని ట్రంప్ అన్నారు.

తాజా వార్తలు