పంధా మార్చుకున్న ట్రంప్ పుతిన్ కు స్వీట్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పంధా మార్చుకున్నారా అనే అనుమానం కలుగుతుంది.ఎప్పుడూ కూడా ప్రపంచ దేశాలపై తీవ్ర హెచ్చరికలతో చెలరేగే ట్రంప్ గారు ఈ సారి స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారు.

 Donald Trump Meet Vladimir Putin1-TeluguStop.com

ఇంతకీ వార్నింగ్ ఇచ్చింది ఎవరికో తెలుసా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.పుతిన్ కు అత్యంత సున్నితంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారట, జీ 20 సదస్సులో పాల్గొన్న వీరిద్దరూ శుక్రవారం ద్వైపాక్షిక చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో భవిష్యత్తు లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ పుతిన్ ను హెచ్చరిస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ తప్పకుండా పుతిన్ ను హెచ్చరిస్తానని అన్నారు.అన్నదే తడవుగా అధ్యక్షా ఎన్నికల్లో జోక్యం చేసుకోకండి అని ట్రంప్ తన వేలును పుతిన్ వైపు చూపిస్తూ రెండు సార్లు రిపీట్ చేశారు.

అయితే తొలుత దీనిపై పుతిన్ మొదట నవ్వి,ఆ తర్వాత తన అనువాదకురాలివైపు చూడగా, ఆమె ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అనువదించడం తో ఆయన మరింత హ్యాపీ గా నవ్వారు.

ఆ తరువాత ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చూకుంటూ తల ఊపుకుంటూ నవ్వుకున్నారు.2016లో జరిగిన ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో దీనిపై విచారణ కూడా జరుగుతుంది.

మరోపక్క ఈ ఆరోపణలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తోసిపుచ్చారు.అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో జరుగనున్న నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ట్రంప్ ని పై ప్రశ్న సంధించడం తో ఈ విధంగా ట్రంప్ స్పందించారు.

ట్రంప్ స్పందనను పుతిన్ కూడా బాగా ఎంజాయ్ చేయడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube