అన్నింటా బిడెన్‌దే పైచేయి.. మూడు వారాలే గడువు: ట్రంప్ కాన్ఫిడెన్స్ ఏంటీ..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.రాబోయే మూడు వారాలపాటు.

 Donald Trump, Lagging In Polls, Tries To Project Strength, America, Donald Trump-TeluguStop.com

రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల అభ్యర్ధులు డొనాల్డ్‌ ట్రంప్‌, జో బిడెన్‌ మధ్య హోరాహోరీ ప్రచారం జరగనుంది.రెండో ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ రద్దుకావడంతో.

ఇక మూడో ముఖాముఖి పైనే అందరి దృష్టి పడింది.ఈ డిబైట్‌లో బిడెన్‌పై ఆధిక్యం సంపాదించి.

అమెరికా ఓటర్ల అభిమానాన్ని సంపాదించాలని ట్రంప్‌ ఎత్తులు వేస్తున్నారు.ఇందుకోసం రిపబ్లికన్‌ వ్యూహ బృందం ప్రణాళికలు రచిస్తోంది.

కరోనా ఎఫెక్ట్‌, నిరుద్యోగం, ఆర్ధిక పరిస్థితి.ఈ మూడు అంశాలే అమెరికా ఎన్నికల్లో కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలైన సమయంలో.వస్తున్న కొన్ని సర్వేల్లో ట్రంప్‌ కన్నా బిడెన్‌కే ప్రజాదరణ ఉన్నట్లుగా తెలుస్తోంది.అయితే ఈ సర్వేలను చూసి ట్రంప్‌ కానీ.ఆయన ప్రచార బృందం కానీ.

ఆందోళన చెందడం లేదు.ఇంత నిశ్చింతకు కారణం లేకపోలేదు.2016 అధ్యక్ష ఎన్నికల్లో కూడా ట్రంప్‌ కంటే హిల్లరీ క్లింటన్‌ వైపే సర్వేలు మొగ్గుచూపాయి.కానీ అంతిమంగా ట్రంప్‌ విజయం సాధించి అధ్యక్ష పీఠం అధిష్టించారు.

ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్‌ చేస్తామంటున్నారు రిపబ్లికన్లు.ఈ సర్వే ఫలితాలతో నిరుత్సాహపడకుండా.చివరిదశ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు.

హుందా, రాజసానికి తగ్గట్లుగానే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ విభిన్నంగా ఉంటుంది.

ఎక్కువ ఓట్లు గెలుచుకున్నంత మాత్రాన, ఎప్పుడూ ఎన్నికల్లో విజయం సాధించడం అనేది జరగదు.ఎలక్టోరల్ కాలేజీ ఓట్లే కీలకపాత్ర పోషిస్తాయి.2016లో జరిగిన సర్వేల్లో హిల్లరీ క్లింటన్ దాదాపు 30 లక్షల పైగా ఓట్లతో డోనాల్డ్ ట్రంప్‌ కంటే ముందంజలో ఉన్నారు.అయినా, ఆమె ఓడిపోయారు.

అందుకు కారణం.అమెరికాలో ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ.

Telugu America, Donald Trump, Electrol Votes, Hillari Clinton, Joe Bidden-Telugu

గత ఏడాది కాలంగా వస్తున్న చాలా సర్వే ఫలితాలు.బిడెన్‌కు అనుకూలంగానే ఉంటున్నాయి.చాలా మటుకు సర్వేల్లో సైతం ట్రంప్ మీద పైచేయి సాధిస్తూనే ఉన్నారు.గడిచిన కొన్నివారాల్లో బిడెన్ హవా 50 శాతం పెరిగింది.కొన్ని సార్లు ఆయన 10 పాయింట్ల ఆధిక్యం కూడా సంపాదించారు.అయితే గత ఎన్నికల సమయంలోనూ సర్వేల్లో వెనుకబడ్డ ట్రంప్.

చివరికి పుంజుకున్నారు. హిల్లరీకి గట్టిపోటీ ఇచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.

అయితే 2016లో హిల్లరీ క్లింటన్‌ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా బిడెన్ బృందం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.ట్రంప్‌కు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా.

చివరి వరకూ పోరాడాలని నిర్ణయించుకుంది.

ట్రంప్ ఎన్నిసార్లు వ్యక్తిగత దూషణలు చేసినా.

ఎదురుదాడికి దిగినా.బిడెన్‌ తన సహనం కోల్పోలేదనే వాదనలూ ఉన్నాయి.

ఐదు దశాబ్ధాల రాజకీయ జీవితంలో బిడెన్.సమయానికి తగ్గట్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని డెమొక్రాట్లు చెబుతున్నారు.ఇదే ఆయనకు ఆదరణ పెంచుతోందని బైడెన్‌ మద్దతుదారులు చెబుతున్నారు.మొత్తంమీద ఈ ఏడాది కరోనా వైరస్, ఆర్థిక వ్యవస్థ రెండింటి ప్రభావం వల్ల నవంబర్‌లో ప్రజలు ఎలా ఓటు వేయబోతున్నారు.

గెలిచేది ట్రంపా.బిడెనా అనేది తేలాలంటే కౌంటింగ్ వరకు ఎదురుచూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube