గల్లీ నేతలా మారిపోతున్న ట్రంప్: బిడెన్‌ చెత్త ప్రత్యర్థి అంటూ వ్యాఖ్యలు

మనదేశంలో ఎన్నికల సందడి మామూలుగా ఉండదు.ఓటర్లకు డబ్బు పంపిణీతో పాటు మద్యం కూడా ఏరులై పారుతుంది.

 Donald Trump Sensational Comments On Joe Biden, Joe Biden, Donald Trump, America-TeluguStop.com

ఇక ప్రచారం విషయానికి వస్తే రాజకీయ విమర్శలను దాటి వ్యక్తిగత విషయాలను సైతం వదిలిపెట్టకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు.గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే పంథా.

ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ ఇదే తరహా వాతావరణం కనిపిస్తోంది.ఎంతో హుందాగా జరుగుతూ.

ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే అమెరికా ఎన్నికల్లో మాటల యుద్ధం ఈసారి ఎక్కువైంది.పోలింగ్‌కు వ్యవధి లేకపోవడంతో వున్న కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు రెచ్చిపోతున్నారు.

సాధారణ రోజుల్లోనే ట్రంప్‌ నోటికి అడ్డూ అదుపూ వుండదు.మరి ఎలక్షన్ టైం.ఇక వేరే చెప్పేదేముంది.తన ప్రత్యర్ధి, డెమొక్రాటిక్ నేత జో బిడెన్‌పై ఆయన విరుచుకుపడుతున్నారు.
తాను అధ్యక్షుడినన్న సంగతిని మరచిపోయి మరీ నోరు పారేసుకుంటున్నారు.దీంతో గత కొద్దిరోజుల నుంచి ప్రచారంలో విమర్శలు, ప్రతి విమర్శల తీవ్రత పెరిగిపోతోంది.అధ్యక్ష అభ్యర్ధులిద్దరూ హుందాగా ప్రవర్తించడం పోయి.గల్లీ స్థాయి నేతల్లా మాట్లాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలో ట్రంప్ మరోసారి తన నోటి దురుసు ప్రదర్శించారు.బిడెన్ లాంటి చెత్త అభ్యర్ధిని తాను అమెరికా ఎన్నికల చరిత్రలోనే చూడలేదని విమర్శించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం భార్య మెలానియాతో కలిసి ఆయన టంపాలో ప్రచారం నిర్వహించారు.ప్రస్తుత ఎన్నికలు అమెరికా కలలకు… సోషలిస్ట్ పీడకలలకు మధ్య జరుగుతున్నాయని ట్రంప్ అభివర్ణించారు.

బిడెన్ అధికారంలోకి వస్తే అమెరికా మరో వెనిజులా లాగా మారిపోతుందని.తాను అధికారంలో వున్నంత వరకు అమెరికా ఎట్టి పరిస్ధితుల్లోనూ సోషలిస్ట్ దేశంగా మారదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మార్క్సిస్టులను, సోషలిస్టులను, అల్లరి మూకలను, వామపక్ష తీవ్రవాదులను ఓడించేందుకు.అమెరికన్ల కోసం పోరాడబోతున్నామని ట్రంప్ తనలోని వక్తను బయటకు తీశారు.బిడెన్ గెలిస్తే అమెరికా అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన ఆరోపించారు.ఇక సర్వేల్లో బిడెన్ దూసుకెళ్తున్న విషయంపై స్పందించిన ట్రంప్.

ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా కష్టపడి పనిచేసే వారికే ప్రజలు ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.మరో నాలుగేళ్ల పాటు తానే వైట్‌హౌస్‌లో అధ్యక్షుడిగా ఉంటానని ట్రంప్ జోస్యం చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube