వలసదారులకు షాక్: ట్రంప్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

ఇమ్మిగ్రేషన్ నిబంధనల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు సోమవారం అనుకూలంగా తీర్పునుచ్చింది.సంక్షేమ ప్రయోజనాలను క్లెయిమ్ చేసే వలసదారులకు శాశ్వత నివాసం, పౌరసత్వాన్ని నిరాకరించే లక్ష్యంతో ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు సోమవారం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 Donald Trump Immigration-TeluguStop.com

ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ న్యూయార్క్ కోర్టు ఇచ్చిన నిషేధాన్ని ఎత్తివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన అభ్యర్ధనకు అత్యున్నత ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులు అనుకూలంగా ఓటు వేశారు.

అధికారంలోకి వచ్చిననాటి నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్.

త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇమ్మిగ్రేషన్ విధానాలతోనే మరోసారి గెలవాలని భావిస్తున్నారు.ఇల్లినాయిస్‌ను కాపాడటానికి ప్రతిచోట ప్రభుత్వం తన విధానాన్ని కొనసాగించేందుకు గాను స్టే ఇస్తున్నట్లు సుప్రీం తన తీర్పులో తెలిపింది.

ఈ వెంటనే తీర్పును శ్వేతసౌధం ప్రశంసించింది.దీనిని అమెరికన్ పన్ను చెల్లింపుదారులు, కార్మికులు, అమెరికా రాజ్యాంగం సాధించిన భారీ విజయంగా వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.

Telugu Donald Trump, Shock, Supremefavor, Trump-

గతేడాది ఆగస్టులో పబ్లిక్ చార్జ్ చట్టానికి ట్రంప్ కొత్త అర్థాన్ని తీసుకొచ్చారు.అమెరికా పౌరుల ప్రయోజనాలను కాపాడటానికి, వలసదారులు ఆర్ధికంగా స్వయం సమృద్ధిగా ఉండాలన్నారు.అయితే కొత్త నిబంధనలు తక్కువ వేతనాల కింద పనిచేసే, పబ్లిక్ సర్వీస్‌పై ఆధారపడివున్న మిలియన్ల మంది హిస్పానిక్ వలసదారుల పౌరసత్వ ఆశలను సజీవంగా ఉంచే ప్రమాదం ఉంది.

Telugu Donald Trump, Shock, Supremefavor, Trump-

మార్పు చేసిన నిబంధనల ప్రకారం.ఫుడ్ స్టాంపులు, పబ్లిక్ హెల్త్ కేర్ ఇతర సంక్షేమాలను ఉపయోగిస్తున్న 22 మిలియన్ల మంది అమెరికన్ పౌరులు కానీ నిర్వాసితులు గ్రీన్‌కార్డు, యూఎస్ శాశ్వత పౌరసత్వాన్ని పొందలేరని వైట్ హౌస్ తెలిపింది.అలాగే దేశంలో వున్న ఇతర దేశాల ప్రజలు నిరుపేదలుగా భావిస్తే వారికి రెసిడెంట్ వీసాను కూడా ఇచ్చేది లేదని వెల్లడించింది.

కాగా.ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతేడాది ఆగస్టులో రాష్ట్రాల కూటమి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

అధ్యక్షుడి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, శ్వేతేతర వలసదారుల పట్ల ఆయన వివక్ష చూపుతున్నారని మండిపడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube