హెచ్ 1 బీ వీసా: భారతీయ విద్యార్ధులు, టెక్కీలకు ట్రంప్ షాక్

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా వుండేది ఇంకో వారమే.అయినప్పటికీ ఆయన ఇమ్మిగ్రేషన్ విధానంలో చివరి వరకు ఒకే పంథాను అనుసరించి, తన స్టాండ్ ఏంటో తెలియజేశారు.

 Indian Companies, Students Set To Lose Out With Higher Wage System Over New H1-b-TeluguStop.com

నాలుగేళ్ల పదవీ కాలంలో విదేశీయులపై కక్షగట్టినట్లు వ్యవహరించిన ట్రంప్.ఎన్నో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు.

చివరికి వెళుతూ వెళుతూ.వలసదారులకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు.

విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాల మంజూరుకు ఇప్పటి వరకు అమల్లో వున్న లాటరీ విధానాన్ని తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

దీని స్థానంలో అధిక వేతనాలు, నైపుణ్యాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు.

ఇందుకు సంబంధించి అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ (డీఓఎల్) ఓ ప్రకటన విడుదల చేసింది.కొత్త సవరణల వల్ల హెచ్ 1 బీ వీసాతో, ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్‌తో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారి వేతనాలు పెరుగుతాయని డీఓఎల్ అభిప్రాయపడింది.

విదేశాల నుంచి తక్కువ వేతనాలకే లభించే ఉద్యోగుల వల్ల అమెరికన్‌లు ఎదుర్కొనే ముప్పును తొలగించే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు.కొత్త నిబంధనలు మార్చి 9 నుంచి అమల్లోకి రానున్నాయి.

అమెరికా ఏటా జారీ చేసే 85 వేల హెచ్‌1బీ వీసాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

Telugu America, Labor, Wage System, Indian, Visa, Setlose-Telugu NRI

హెచ్ 1 బీ వీసాల్లో మార్పులు భారతీయ టెక్కీలపై, అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాజా నిబంధనల ప్రకారం.సంబంధిత రంగంలో ఉద్యోగికి లభిస్తున్న సగటు వేతనం కన్నా ఎక్కువ వేతనం అందించేందుకు సిద్ధమైన కంపెనీల దరఖాస్తులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది.

ఆక్యుపేషనల్‌ ఎంప్లాయిమెంట్‌ స్టాటిస్టిక్స్‌ (ఓఈఎస్‌) డేటా ఆధారంగా వివిధ ఉద్యోగ విభాగాల్లో వేతనాలను, నాలుగు స్థాయిలుగా వర్గీకరిచి డీఓఎల్‌ నియంత్రిస్తుంది.తాజా మార్పుల ప్రకారం.ఈ స్థాయుల్లో కనీస వేతన స్థాయి భారీగా పెరగనుంది.అలాగే, భారత్‌ సహా విదేశీ కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్‌ 1 బీ వీసా పొందేందుకు భారీగా వేతనాలను చెల్లించాల్సి వుంటుంది.

ఇక విద్యార్ధుల విషయానికి వస్తే.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వివిధ యూనివర్సిటీల్లో సుమారు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు.హెచ్ 1 బీ వీసా విధానంలో తాజా మార్పుల వల్ల అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, సీనియర్లకు మాత్రమే ప్రాధాన్యత లభిస్తుంది.దీని వల్ల విద్యార్థులు, తక్కువ అనుభవం ఉన్నవారు నష్టపోనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube