గెలుపు కోసం ఇన్ని కుట్రలా..బయటపడ్డ ట్రంప్ ఆడియో...!!

అమెరికా అధ్యక్షుడంటే ఎంత హుందాగా ఉండాలి, అధ్యక్ష పీటానికి వన్నె తెచ్చేలా వ్యవహరించాలి.కానీ ముందు నుంచి డోనాల్డ్ ట్రంప్ వివాదాల దారిలో పయనించడమే కాకుండా, అమెరికా అధ్యక్షుడుగా ఇలాంటి వ్యక్తిని ఎలా ఎన్నుకున్నారు అమెరికన్స్ అనే పరిస్థితికి వచ్చేశారు.

 Donald Trump Pressured Georgia Election Official To Change Results, Donald Trump-TeluguStop.com

రాజకీయాలు అన్నాక కుట్రలు, కుతంత్రాలు సహజంగానే జరుగుతూ ఉంటాయి.కానీ ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన ఎన్నికలపై కూడా ట్రంప్ విమర్సలు చేస్తూ తనను కావాలనే ఓడించారని వ్యాఖ్యానించడం అందరిని విస్మయానికి గురిచేసింది…ఇదిలాఉంటే

ట్రంప్ తన గెలుపు కోసం ఎలాంటి కుట్రలు తెరవెనుక చేశాడో తాజాగా బయల్పడింది.

ట్రంప్ తిక్కలోడే అనుకున్నాం కానీ ఈ రేంజ్ లో దాదాగిరి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతాడని అస్సలు ఊహించలేదంటూ ముక్కున వేలేసుకుంటున్నారు అమెరికా ప్రజలు.ఇంతకీ ఎం జరిగిందంటే.

జార్జియా రాష్ట్రంలో అత్యున్నతమైన పదవిలో ఉన్న ఎలక్షన్ అధికారికి ట్రంప్ ఫోన్ చేసి తామే గెలిచామని ప్రకటించాలని ఒత్తిడి చేశారు.

ప్రస్తుత ఫలితాలు తనకు అనుకూలంగా రావాలని, ఫలితాలను తారుమారు చేయాలని కోరారు.

తాను అక్కడి ఎన్నికల్లో విజయం సాధించాలంటే తప్పకుండా 11,780 ఓట్లు అవసరమని సదరు అధికారితో ట్రంప్ సంభాషించినట్టుగా తెలుస్తోంది.ఈ తతంగం మొత్తాన్ని అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక బయటపెట్టింది.

తన ఆదేశాలను భేఖాతరు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, క్రిమినల్ కేసుల వరకూ వెళ్ళాల్సి ఉంటుందని ట్రంప్ ఒత్తిడి చేసినట్టుగా ఆడియో టేపులో స్పష్టంగా అర్థమవుతోందని వాషింగ్టన్ పోస్ట్ ప్రకటించింది.అయితే ఇప్పటి వరకూ ఈ విషయంపై వైట్ హౌస్ గానీ, ట్రంప్ కానీ లేదంటే పార్టీ వర్గాలు గానీ ఖండన ఇవ్వకపోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube