అమెరికా పౌరుడి కోరిక తీర్చిన ట్రంప్...?  

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ అమెరికన్ చివరి కోరికని మన్నించాడు. మరొక ఆరు నెలల్లో చనిపోతాడని వైద్యులు స్పష్టం చేయగా తాను తన చివరి కోరికని కుటుంభ సభ్యులకి తెలిపారు. ఇంతకీ ఏమిటా కోరిక, ట్రంప్ ఎలాంటి సాయం చేశాడు అనే వివరాలు తెలియాలంటే

  • బ్రెట్‌ అనే అమెరికన్ వ్యక్తి సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌ అనే వ్యాధితో తీవ్రంగా భాదపడుతున్నాడు. అతడికి మరో ఆరు నెలలు మాత్రమే జీవించే అవకాశం ఉందని తేల్చిన వైద్యులు కుటుంభ సభ్యులకి వివరాలు తెలిపారు. అయితే తన సోదరి వద్దనే బ్రెట్ తన చివరి జీవితం ముగించాలని అనుకున్నాడు. అయితే బ్రెట్ రిపబ్లికన్ మద్దతు దారుడు కాగా, అయన సోదరి డెమోక్రాటిక్ పార్టీ మద్దతు దారురాలు.

  • Donald Trump Fulfilled The Last Wish Of His Dying Supporter-Dying Man\'s Dying Supporter Jay Barrett Last Us President

    Donald Trump Fulfilled The Last Wish Of His Dying Supporter

  • ఇదిలాఉంటే ట్రంప్ తో ఒక్క సారైనా సరే మాట్లాడాలని అనుకున్న తన అన్న కోరికని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొంతమంది సాయంతో వైట్ హౌస్ కి మెయిల్ పంపింది.దాంతో వాళ్ళు ఊహించని విధంగా ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బ్రెట్‌కు ఫోన్‌ చేశారు. నేను మీకు పెద్ద అభిమానిని. ఎలాంటి సందర్భాలలోనైనా నేను మీకే మద్దతుని ఇస్తానని బ్రెట్‌ ట్రంప్‌తో అన్నాడు. నీ ఆరోగ్యం మెరుగు అయ్యాక మళ్ళీ కలుస్తా అంటూ ఆ అభిమాని కోరిక తీర్చాడు ట్రంప్.