కరోనా కష్టంలో..కీలక అధికారిపై ట్రంప్ వేటు..!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా సమయంలో కూడా అధికారులపై వేటు వేస్తున్నారు.గతంలో తనకి ఎదురు చెప్పిన ఎంతో మందని కీలక అధికారులు, రక్షణ శాఖకి చెందిన అధికారులని సైతం లెక్క చేయకుండా తొలగించిన ట్రంప్ తాజాగా ఆదేశ అలర్జీ, అంటూ వ్యాధుల సంస్థ డైరెక్టర్ ఆంటోని పౌచీ పై వేటు వేయడానికి సిద్దమయ్యారు.

 Anthony Fauci, Donald Trump, Corona, National Institute Of Allergy And Infectiou-TeluguStop.com

ట్విట్టర్ వేదికగా ట్రంప్ , పౌచీ ల మధ్య వార్ బయటపడింది.

పౌచీ తాజాగా ఓ టీవీ ఛానెల్ కి కరోనా గురించి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూ నే పౌచీ కొంప ముంచింది.భౌతిక దూరం, లాక్ డౌన్ లాంటి నిభందనలు మొదట్లోనే మనం అమలు చేసి జాగ్రత్తగా ప్రజలకి తెలిసేలా చేస్తే భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగేది కాదని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి బదులుగా చెప్పారు.

Telugu Anthony Fauci, Corona, Donald Trump-

ముందుగానే మనం మేల్కొని ఉండిఉంటే తప్పకుండా అమెరికా ప్రజల ప్రాణాలు నిలిచేవని చెప్పారు.అంతేకాదు.దేశ వ్యాప్తంగా ఉన్న ఆంక్షలని ఒక్క సారిగా సడలిస్తే ఆ ప్రక్రియ కొంత కాలం నిరంతరంగా జరగాలని లేకపోతే రోగుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని ఆయన హెచ్చరించారు.అమెరికాలో నవంబర్ 3 వ తేదీన జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్స్ నేరుగా వెళ్లి ఓటు వేయడం అంత మంచిది కాదనేది తన అభిప్రాయమని వెల్లడించారు.

అయితే ముందుగానే మేల్కొని ఉండిఉంటే ఇంతటి ప్రాణనష్టం జరిగేది కాదన్న వ్యాఖ్యలపై ట్రంప్ సీరియస్ అయ్యారు.ట్విట్టర్ వేదికగా ట్రంప్ కి.పౌచీ కి మాటల యుద్ధం జరగడంతో ఇక పౌచీ తన పదవిలో కొనసాగే అవకాశాలు లేవని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube