పరిస్థితి అర్ధమవుతోందిగా.. దిగొచ్చిన డొనాల్డ్ ట్రంప్..!!  

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలు వచ్చి నెల కావొస్తోంది.కొన్ని చోట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానప్పటికీ జో బైడెన్ అధ్యక్షుడిగా కన్ఫార్మ్ అయినట్లే.

TeluguStop.com - Donald Trump Finally Agrees To Biden Transition

కానీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తూ కోర్టులకెక్కిన సంగతి తెలిసిందే.దీంతో పాటు అధికార బదలాయింపుకు సైతం ఆయన అడ్డుపడుతున్నారు.

కొద్దిరోజుల క్రితం నాదే గెలుపు అంటూ ట్వీట్ చేసి ట్రంప్ సంచలనం సృష్టించారు.ఈ నేపథ్యంలో ఆయనకు మెల్లగా పరిస్ధితి అర్థమవుతూ ఉండటంతో ఆయన పంతం వీడారు.

TeluguStop.com - పరిస్థితి అర్ధమవుతోందిగా.. దిగొచ్చిన డొనాల్డ్ ట్రంప్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు ట్రంప్ అంగీకరించారు.తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఓటమిని అంగీకరిస్తూనే.ఎన్నికల ఫలితాలపై తాను చేస్తున్న పోరాటం కొనసాగుతుందని ట్రంప్ పేర్కొన్నారు.అధికార మార్పిడి ప్రక్రియను ప్రారంభించడానికి ట్రంప్ పరిపాలన సిద్ధంగా ఉందని, జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేటర్ ఎమిలీ మర్ఫీ అన్నారు.అధ్యక్షుడిగా ఎన్నికైన బిడెన్‌కు ఎమిలీ మర్ఫీ లేఖ రాసిన కొన్ని గంటల తర్వాత సోమవారం ట్రంప్ ట్వీట్లు చేయడం గమనార్హం.

దేశ ప్రయోజనాల దృష్ట్యా అధికార బదిలీకి కావాల్సిన ప్రక్రియను ప్రారంభించాలంటూ ట్రంప్‌ అధికారుల్ని ఆదేశించారు.అధికార బదిలీలో కీలక పాత్ర పోషించే జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంగా చీఫ్ ఎమిలీ మర్ఫీపై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు.

గత కొన్ని రోజులుగా ఆమెను తీవ్రంగా వేధిస్తున్నారని.ఇకపై ఇది కొనసాగాలని నేను అనుకోవడం లేదని ట్రంప్ తెలిపారు.ఫలితాలపై మా న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.అంతిమంగా మేమే విజయం సాధిస్తామని నేను నమ్ముతున్నానని ఆయన ట్వీట్ చేశారు.కాగా ట్రంప్ నిర్ణయాన్ని బైడెన్ స్వాగతించారు.అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా సాగేందుకు ఇదొక ముందడుగని ఆయన వ్యాఖ్యానించారు.

అంతకుముందు ట్రంప్‌ అధికారిక ప్రకటనకు ముందే బైడెన్‌ గెలుపును జీఎస్‌ఏ గుర్తించింది.అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ బైడెన్‌ బృందానికి మర్ఫీ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

తొలుత ప్రభుత్వ భవనాలు, అధికారులు, పరికరాల వినియోగానికి బైడెన్‌ బృందానికి అనుమతి ఇవ్వడంతో పాటు అందుకు కావాల్సిన నిధులను కేటాయించాల్సి వుంటుంది.అయితే ట్రంప్‌ ఓటమిని అంగీకరించకపోవడంతో మర్ఫీ ఈ ప్రక్రియను ఆలస్యం చేశారు.

దీంతో వివిధ వర్గాల నుంచి ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొవడంతో ఆమె స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

#Joe Biden #Biden Cabinet #Kamala Harries #Donald Trump

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు