రిపోర్టరా మజాకానా..ట్రంప్ ప్యూజులు పీకేసిందిగా..!!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో తల మునకలై ఉన్నారు.వ్యూహ ప్రతి వ్యుహాలను పక్కగా ప్లాన్ చేసుకుంటూ మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందాలని ఉవ్విళ్లూరుతున్నారు.

 Trump Lied On Retired Workers Healthcare Program, Donald Trump, Female Reporter,-TeluguStop.com

అయితే తన సహజ శైలిని, తుంటరి తనాన్ని మాత్రం ఇప్పటికి అదుపు చేసుకోలేక పోతున్నారు.ఎప్పటిలానే మీడియా అడిగే ప్రశ్నలకి సమధానం చెప్పలేక చిందులు తొక్కుతున్నారు.

తాజాగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలిన ట్రంప్ వీరావేశంతో ఊగిపోతూ మధ్యలోనే సమావేశాన్ని ముగించేశారు.

న్యూజెర్సీ లో గోల్ఫ్ క్లబ్ లో మీడియా తో మాట్లాడిన ట్రంప్ రిటైర్డ్ వర్కర్స్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ లో తాను ఎంతో విజయాన్ని సాధించానని చెప్పుకొచ్చారు.

ఏ అధ్యక్షుడు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేక పోయారని, ఈ విషయంలో తానకి సాటి ఎవరూ లేరని తానూ చేసి చూపించానని తెలిపారు.ఈ విషయం చెప్పీ చెప్పగానే ఓ మహిళా విలేఖరి ట్రంప్ మాటలకి అడ్డు తగిలారు.

మీరు చెప్పిన ఈ కార్యకమం ఒబామా హయాంలోనే అమలు జరిగింది కదా మీ క్రెడిట్ అని ఎలా చెప్పుకుంటారు అంటూ ప్రశ్నించారు దాంతో ఖంగుతిన్న ట్రంప్ ధ్యాంక్యూ ఆల్ అంటూ సమావేశాన్ని ముగించారు.ఇదిలాఉంటే

ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2014 లో రిటైర్డ్ వర్కర్స్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు.

దీని ప్రకారం రిటైర్ అయిన వ్యక్తులు ఎవరైనా సరే ప్రవైటు ఆసుపత్రులలో కూడా ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు, ప్రభుత్వం ఖర్చులు అన్నీ భరిస్తుంది.ఇదే కార్యక్రమాన్ని ట్రంప్ 2018 లో విస్తరించారు.

ఈ విషయం వెల్లడిస్తూనే తానె ఈ కార్యక్రమాన్ని రూపొందించానని చెప్పడంతో ఒక్క సారిగా విస్తుపోయిన రిపోర్టర్ అందరిముందు ఇది ఒబామా కార్యక్రమం కదా అంటూ ప్రశ్నించింది.దాంతో సమావేశం పూర్తవ్వకుండానే మధ్యలోనే ట్రంప్ మెల్లగా జారుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube