ఇక సెలవు... వెళుతున్నా: అధ్యక్షుడిగా ట్రంప్ వీడ్కోలు సందేశం- Donald Trump Farewell Address Speech From White House

In farewell address, Trump urges prayers for next administration, Donald Trump, Donald trump Farewell Speech, White house, Joe Biden Inauguration, Social Media ban, China - Telugu China, Donald Trump, Donald Trump Farewell Speech, In Farewell Address, Joe Biden Inauguration, Social Media Ban, Trump Urges Prayers For Next Administration, White House

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ శకం ముగిసింది.ఈ నాలుగేళ్లలో ఎన్నో వివాదాలు, మరెన్నో సంచలన నిర్ణయాలు, మధ్యలో తీపి జ్ఞాపకాలు ఇలా దేశ చరిత్రలో విభిన్నమైన పాలన అందించిన అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు.

 Donald Trump Farewell Address Speech From White House-TeluguStop.com

మరికొద్దిగంటల్లో కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ నేపథ్యంలో ట్రంప్ వైట్‌హౌస్‌లో ఇన్నాళ్లు తనకు సహకరించిన వారికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

నాలుగేళ్ల కిందట దేశాన్ని పునర్నించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశామని.కొత్త ఉత్సాహం, ఉత్తేజంతో పౌరులకు ప్రభుత్వాన్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో పని చేశామని ట్రంప్‌ చెప్పారు.

 Donald Trump Farewell Address Speech From White House-ఇక సెలవు… వెళుతున్నా: అధ్యక్షుడిగా ట్రంప్ వీడ్కోలు సందేశం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమెరికా అధ్యక్షుడిగా పని చేయడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని… ఈ అవకాశం ఇచ్చిన అమెరికన్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కొత్తగా అధికార బాధ్యతలు చేపడుతున్న యంత్రాంగం అమెరికాను సురక్షితంగా ఉంచడంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తన వీడ్కోలు సమావేశంలో ట్రంప్ చెప్పారు.

అధ్యక్ష ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ట్రంప్ విచారం వ్యక్తం చేశారు.ఇదే సమావేశంలో తన హయాంలో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు.చైనాతో వైఖరి, తనపై సోషల్‌ మీడియా నిషేధం తదితర అంశాలపై మాట్లాడారు.మధ్యప్రాచ్యంలో అనేక శాంతి ఒప్పందాలు కుదిర్చేందుకు కృషి చేశానని, చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్ధతు కూడగట్టడంలో విజయం సాధించానని ట్రంప్ గుర్తుచేశారు.

అలాగే తన హయాంలో యుద్ధం అన్న మాట లేదని వెల్లడించారు.ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికాకు బయటి శక్తుల నుంచి ముప్పు పొంచి వుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

అయితే సమావేశంలో ఎక్కడ కూడా జో బైడెన్‌ పేరు ఉచ్చరించకపోవడం గమనార్హం.

#White House #InFarewell #JoeBiden #China #Donald Trump

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు