యూకే స్ట్రెయిన్: వీసాలపై అమెరికా కన్నెర్ర.. ఆ దేశాలపై ఆంక్షలు

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు కోలుకుంటున్న వేళ.బ్రిటన్‌‌లో వెలుగు చూసిన కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.

 Donald Trump Extends Visa Sanctions On Countries Refusing To Repatriate Their Na-TeluguStop.com

ఇప్పటికే కోవిడ్‌తో కోలుకోలేని దెబ్బ పడిన అమెరికాకు ఇప్పుడు స్ట్రెయిన్ ఆందోళన కలిగిస్తోంది.దీంతో అగ్రరాజ్యానికి మరో ముప్పు పొంచి వుంది.

అమెరికాలో ఈ స్థాయిలో కోవిడ్ కల్లోలం సృష్టించడానికి తన ఉదాసీన వైఖరే కారణమని ట్రంప్ అప్రతిష్టను మూటకట్టుకున్నారు.ఈసారి అలాంటి పేరు తనకు వద్దనుకుంటున్న అగ్రరాజ్యాధినేత.

వీసాల విషయంలో కొన్ని దేశాలపై వున్న ఆంక్షలను పొడిగించారు.

తమ పౌరులను వెనక్కి రప్పించుకునేందుకు నిరాకరిస్తున్న దేశాలపై కన్నెర్ర చేశారు.

ఆ దేశాలపై ఇప్పటికే వున్న వీసా ఆంక్షల నిషేధాన్ని పొడిగించారు. డిసెంబర్ 31 వరకు వాటిపై నిషేధం అమలులో వుంది.

కొత్త రకం కోవిడ్‌తో పాటు ఆయా దేశాల వైఖరి కారణంగా అమెరికా పౌరుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీసా నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ట్రంప్ వివరించారు.అమెరికాలో ఉంటూ, ఆ దేశ చట్టాలను ఉల్లంఘించిన విదేశీయులను వాపస్ పిలిచేందుకు నిరాకరిస్తున్న దేశాల వైఖరిపై ట్రంప్ మండిపడిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సదరు దేశాల పౌరులకు వీసాల జారీని నిషేధిస్తూ ఏప్రిల్ 10 అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు వీసాల జారీని తిరస్కరించే అధికారాన్ని పలు ఏజెన్సీలకు కట్టబెట్టారు.

Telugu Anthony Pouchi, Corona Epidemic, Joe Biden, Kamala Harris, Trump, Uk Stra

కాగా, కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌కు సంబంధించి అమెరికాలో తొలి కేసు నమోదైంది.కొలరాడో రాష్ట్రానికి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడికి యూకే స్ట్రెయిన్ సోకినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ జేర్డ్ పొలిస్ ప్రకటించారు.అయితే ఆ వ్యక్తికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం అధికారులను మరింత భయపెడుతోంది.మరి ఎక్కడికి వెళ్లకుండా ఆ యువకుడికి కొత్త వైరస్ ఎలా సోకిందన్న విషయం అంతు చిక్కడం లేదు.

దీంతో ఈ మిస్టరినీ ఛేదించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.కాగా, ప్రస్తుతం ఆ యువకుడు ఐసోలేషన్‌లో ఉన్నాడు.అతని ప్రైమరీ కాంటాక్ట్స్‌ని ట్రేస్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.బ్రిటన్‌లో కొత్త వైరస్‌ వెలుగు చూడటంతో అమెరికా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.

యూకే నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్ 19 నెగిటివ్ రిపోర్ట్ చూపించాల్సిందేనని స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube