ట్రంప్ సంచలన వ్యాఖ్యలు...రిజల్ట్ సుప్రీంకోర్టు చేతిలో..!

అమెరికాలో నవంబర్ 3 న జరగనున్న అధ్యక్ష ఎన్నికలపై రోజు రోజుకి ఉత్కంట పెరిగిపోతోంది.ట్రంప్, బిడెన్ ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్ధులు ప్రచారంలో జోరు పెంచుతున్నారు.

 Trump Confirms  Plans To Take Election Results To The Supreme Court, Donald Trum-TeluguStop.com

విమర్శలు చేయడంలో కానీ, విమర్శలతో ప్రజల దృష్టిని ఆకర్షించడంలో కానీ ట్రంప్ కి పెట్టింది పేరు.ఎప్పుడూ ఎదో ఒక విమర్శ చేస్తూ సంచలనాలు సృష్టించే ట్రంప్ తాజాగా అమెరికా భవిష్యత్తు రాజకీయాలపై, ఎన్నికల్లో వచ్చే రిజల్ట్స్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో డెమోక్రటిక్ పార్టీలో గుబులు రేగుతోంది…

శ్వేత సౌధంలో నిన్నటి రోజున జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్ మీడియా ప్రతినిధులు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు ఇస్తున్నారు.ఈ లోగా ఓ విలేఖరి మాట్లాడుతూ ఎన్నికల అనంతరం బదిలీల విషయంలో అన్నీ సజావుగా సాగుతాయా అంటూ ప్రశ్నించారు.

దాంతో ట్రంప్ ఆ ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పలేదు.ఏమి జరిగుతుందో వేచి చూడాలి చూద్దాం అంటూ బదులు ఇచ్చారు.

అమెరికా ఎన్నికల ఫలితాలను బహుశా సుప్రీం కోర్టు తేల్చే అవకాశం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు…

కరోనా కారణం చూపించి ఈ ఎన్నికల్లో పోస్టల్ ఓటింగ్ వేయిస్తున్నారు.ఈ అవకాశాన్ని డెమోక్రటిక్ పార్టీలు తమకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగే అవకాశం లేకపోలేదు.ఈ బ్యాలెట్ ఓటింగ్ ల వలన తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోందని అన్నారు.

ఈ విధానం గనుకా తీసేస్తే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని, అసలు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు.అయితే మరో సారి కూడా అమెరికా అధ్యక్షుడిగా అధికారాన్ని సాధించేది తానేనని ధీమా వ్యక్తం చేశారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube