ఆ ఒక్క ట్వీట్ తో పరువు పోగొట్టుకున్న ట్రంప్ పుత్రరత్నం.. భారి మూల్యం చెల్లించుకోవాల్సిందే..!!

“విత్తనం ఒకటి వేస్తే చెట్టు మరొకటి మొలుస్తుందా”.ఈ సామెత మనం చాలాసార్లు వినే ఉంటాం.సాధారణంగా మన పెద్దవాళ్ళు ఈ డైలాగ్ ఎక్కువ వాడుతుంటారు.ఇప్పుడు ఈ సామెత అమెరికా అధ్యక్ష అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ కుమారుడికి సరిగ్గా సరిపోతుంది.ఇదేంటి ఈ సామెతకి ఎక్కడో ఉన్న ట్రంప్ కొడుకుకి లింక్ ఏంటా అని ఆలోచిస్తున్నారా.?? అయితే ఇక ఆలస్యం చెయ్యకుండా ఇది చదవండి మీకే తెలుస్తుంది… అసలు ఆ కధ ఏంటో.ఈ సామెత కి , ట్రంప్ కుమారుడికి ఉన్న లింక్ ఏంటో.మీకే క్లీయర్ గా అర్ధమౌతుంది.

 Donald Trump Elder Son Tweet Against India And Chaina, America, Elections, Donal-TeluguStop.com

డొనాల్డ్ ట్రంప్‍.ఆయన గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.ఎందుకంటే.?? ఆయన మాటలతో, వ్యవహార శైలితో, ప్రవర్తనతో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు.ఆయన రూటే సపరేటు.ఆయనకు నచ్చితే ఓకే నవ్వుతూ సమాధానమిస్తాడు… లేదంటే చిటపట చిందలేస్తూ.ముఖానే తిట్టేస్తాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.

.ఎలాగైనా మళ్లీ అధ్యక్ష పీఠం దక్కించుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేసాడు.

ఓ వైపు కరోనా మిమ్మల్ని వదలను అమెరికన్స్ అని పట్టి పీడిస్తున్న.ట్రంప్ ఏ మాత్రం లెక్కచెయ్యకుండా.

నువ్వు మొండి అయితే నేను జగ ముండి,నువ్వు కంత్రి అయితే నేను జగత్ కంత్రి అన్నట్లు .కరోనా కి భయపడకుండా, బెదరకుండా ధైర్యంగా ఎన్నికల చివరి రోజు వరకు మళ్లీ అమెరికా అధ్యక్ష పదవి చెజిక్కించుకోదానికి తన స్దాయి శక్తుల ప్రయత్నించాడు.అవి ఎంత వరకు ఫలించాయో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

అయితే, కరోనా కష్ట కాలంలోను ట్రంప్ ధైర్యంగా ర్యాలీలు, ప్రచార సభలు నిర్వహిస్తూ.

తనదైన స్టైల్ లో ప్రోసిడ్ అయ్యారు.కుదిరితే బుజ్జగించాడు,వినకపోతే బెదిరించాడు.

ఇవ్వని కుదిరే పని కాదు అనుకుని నోటికి వచ్చినట్లు.ఇష్టం వచ్చినట్లుచాలా తేలికగా.

చైనా పై,రష్యా పై, చివరికి అమెరికాతో ఎన్నో సత్సంభంధాలు ఉన్న మన ఇండియా పై కూడా నోరుపారేసుకున్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల ఓట్లు ఏంతో కీలకం అని సర్వేలు,ప్రముఖులు,ఎందరో రాజకీయ విశ్లేషకులు చెపుతూ ఉన్నా.

తన మొండి వైఖరితో పదే పదే.భారత్ పై ట్రంప్ టంగ్ స్లిప్ అవుతూనే ఉన్నారు.కరోనా విషయంలో భారత్ తప్పుడు లెక్కలు చూపిస్తుంది అని,భారత్ లో ఉండేది రోత గాలి అని. భారత్ పై చాలనే నిందలు వేసారు ట్రంప్.ఇప్పుడు ఇవి చాలదు అన్నట్లు.తండ్రికి తగ్గ తనయుడిగా ట్రంప్ కుమారుడి భారత్ పై ఓ ట్వీట్ చేసారు.ఈ ట్వీట్ చూసిన భారతీయులు.వివాదాస్పద వాఖ్యలు చేయడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్ తండ్రితో పోటీ పడుతున్నారు.

అంటున్నారు.

ఇంతకి ఆ ట్వీట్ ఏమిటంటే .అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఓ ఫొటోను ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.అయితే ఆ ఫొటోలో ప్రపంచంలోని దేశాలన్నీ దాదాపు ఎరుపు రంగులో ఉండగా భారత్, చైనా మాత్రం నీలం రంగులో ఉన్నాయి .అమెరికాలో ఎరుపు రంగు రిపబ్లికన్ పార్టీగా.నీలం రంగు డెమొక్రాటిక్ పార్టీగా ఉంది.

ఇక డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పోస్ట్ చేసిన ఫొటోను బట్టి చూస్తే. భారత్, చైనా తప్ప అన్ని దేశాల్లోనూ ట్రంప్‌దే విజయం అని ఆయన చెబుతున్నారు.

ఈ రెండు దేశాలు మాత్రం డెమొక్రాట్లకు మద్దతుగా ఉన్నాయని ఆయన పోస్ట్ బట్టి అర్థం అవుతుంది అని పలువురు రాజకీయ పండితులు అభిప్రాయపడూతున్నారు .భారత్ తమ మిత్రదేశమని ట్రంప్ అనేక సార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే ఆయన కుమారుడు మాత్రం ఈ ట్వీట్ ద్వారా భారత్ బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా కావాలని కోరుకుంటున్నట్లు తన మనసులోని భావాన్ని బయటపెట్టాడు.అంతేకాదు .ట్రంప్ కుమారుడు పోస్ట్ చేసిన ఫొటోలో జమ్మూ కశ్మీర్ పాకిస్థాన్‌లో భాగంగా ఉంది.భారత్ నీలం రంగులోనూ.

పాకిస్థాన్‌లో కలిసి ఉన్నట్టుగా ఉన్న జమ్మూకశ్మీర్ ఎరుపు రంగులోనూ ఉంది.దీంతో భారతీయులు ట్రంప్ కుమారుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్ కుమారుడు పోస్ట్ పై నెటిజన్స్ భిన్న-విభిన్నంగా స్పందిస్తున్నారు.అమెరికా తదుపరి అధ్యక్షుడు ఏవరు అని అందరు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న వేళ ట్రంప్ కుమారుడు చేసిన ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

మరి ట్రంప్ కూమారుడి చేసిన ఈ ట్వీట్ కి .ట్రంప్ భారి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఏమో అని పలువురు ప్రముఖల నుండి వినిపిస్తున్న మాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube