వైట్‌హౌస్‌లో చివరి రోజు: శుభకార్యంతో శ్వేతసౌధాన్ని వీడిన ట్రంప్.. !!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాన్ని వదిలే చివరి రోజున ఎలా ఉంటారోనని ఆయన మద్ధతుదారులతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా గమనించింది.నాలుగేళ్ల పాటు అగ్రరాజ్యానికి అధినేతగా వ్యవహరించిన వ్యక్తి.

 Trump's Daughter Tiffany Announces Engagement With Billionaire Heir Boyfriend Mi-TeluguStop.com

ఇక నుంచి ఖాళీగా ఉండటమంటే అది కొంచెం కష్టమే.కానీ ఆ బాధ మనసులోకి రాకుండా ట్రంప్ శుభకార్యంతో వైట్‌హౌస్‌ను వీడారు.

ఆయన చిన్న కుమార్తె టిఫానీ ట్రంప్ నిశ్చితార్ధాన్ని ఆయన శ్వేతసౌధంలోనే నిర్వహించారు.
రెండో భార్య మార్లా మాపేల్స్‌‌కు ట్రంప్‌కు టిఫానీ ఏకైక సంతానం.

అమెరికాలోని సంపన్నుల్లో ఒకరైన మైఖేల్ బౌలస్‌తో టిఫానీకి రెండేళ్ల నుంచి పరిచయం వుంది.ఆమె కంటే బౌలస్ నాలుగేళ్లు వయసులో చిన్న.

కాగా బౌలస్ తండ్రి లెబనాన్ నుంచి బహిష్కరణకు గురికావడం గమనార్హం.ఇక నిశ్చితార్ధానికి సంబంధించి టిఫానీ ట్రంప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను విడుదల చేశారు.

వైట్‌హౌస్‌లో తన కుటుంబంతో గడిపిన క్షణాలు.ఎన్నో జ్ఙాపకాలిచ్చాయని అయితే మైఖేల్‌తో నిశ్చితార్ధం కంటే ప్రత్యేకమైనది లేదని ఆమె తెలిపారు.

ఆ తర్వాత కొద్దిసేపటికీ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కు గుడ్ బై చెప్పారు.తన భార్య మెలానియా ట్రంప్‌తో కలసి ఆయన అమెరికా అధ్యక్ష భవనం నుంచి బయటకు నడిచారు.ఫ్లోరిడాలోని తన సొంత ఇంటికి ఆయన వెళ్లారు.

Telugu Donald Trump, Joe Biden, Tiffanymichael, Trumps Tiffany, Trumpstiffany, W

అంతకు ముందు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా తన వీడ్కోలు సందేశం ఇచ్చారు.20 నిమిషాల కన్నా తక్కువ నిడివి ఉన్న ప్రి రికార్డెడ్ వీడియోను వైట్ హౌస్ కార్యాలయం విడుదల చేసింది.ఏం చేసేందుకు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించానో.

తన పాలనలో అన్నీ చేశామని ట్రంప్ వెల్లడించారు.చెప్పినదాని కంటే ఎక్కువే చేశామని ఆయన పేర్కొన్నారు.

దేశం కోసం కఠినమైన యుద్ధాలు.పోరాటాలను చేశామని ట్రంప్ పునరుద్ఘాటించారు.

అమెరికా భద్రత, అభివృద్ధి కోరుకునే వాడినన్న ఆయన….జో బైడెన్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube