ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..ఆ విషయంలో సక్సెస్ అయ్యారా..??

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత కొంత కాలంగా తీరని మనో వేదనతో అల్లాడి పోతున్నారు.ఒక పక్క ప్రపంచం మొత్తంలో కరోన అమెరికా మీద పగబట్టినట్టుగా చేసిన కరాళ నృత్యం లక్షలాది మంది ప్రజలను పొట్టన బెట్టుకోగా మరెంతో మంది అమెరికన్స్ కరోనా బారిన పడటంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

 Donald Trump, Americans, Corona Vaccine, Corona Virus, Us Supply Covid Vaccine S-TeluguStop.com

కేవలం కరోనా విషయంలో ట్రంప్ చేసిన నిర్లక్ష్యమే ప్రస్తుతం అమెరికాలో ఇలాంటి పరిస్థితి కి కారణమయ్యిందని అమెరికాలో మాత్రమే కాదు యావత్ ప్రపంచం సైతం నమ్ముతోంది.దాంతో ఈ ప్రభావం ఎన్నికలపై ఏ స్థాయిలో ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.ఇదిలాఉంటే

ట్రంప్ ప్రస్తుతం ఫుల్ జోష్ గా ఉన్నారని తెలుస్తోంది.తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు నిదర్సనమే.ఏ కరోనా అయితే అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని భావించారో అదే కరోనా కారణంగా మళ్ళీ విజయం, సాధిస్తానని ట్రంప్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.ప్రపంచం మొత్తంగా కరోనా వ్యాక్సిన్ తామే అందించబోతున్నామని అతి త్వరలో అందుబాటులోకి రానున్నాడని ట్రంప్ తాజాగా మీడియాకి తెలిపారు.

దాదాపు అన్ని దేశాలు వ్యాక్సిన్ తయారీలో ముందు వరుసలో ఉండగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి.

Telugu Americans, Corona Vaccine, Corona, Donald Trump, Supplycovid-

అమెరికా గతంలో వెంటిలేటర్లు, వైద్య పరికరాలు, మాస్క్ లు అందించినట్టుగానే కరోనా వ్యాక్సిన్ కూడా అన్ని దేశాలకి అందిస్తుందని తెలిపారు.మెడేర్నా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాలని ఇస్తున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాక్సిన్ పని తీరుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఇది అందుబాటులోకి వచ్చి అమెరికా ప్రజలు కరోనా మహమ్మారి నుంచీ బయటపడితే ట్రంప్ పై ఇప్పటి వరకూ నెలకొన్న వ్యతిరేకత ఒక్క సారిగా తుడిచి పెట్టుకు పోతుందని ట్రంప్ వర్గం అభిప్రాయపడుతోంది.ఒక వేళ అదే జరిగితే నిజంగా ట్రంప్ అమెరికా ప్రజల మనసు గెలుచుకున్నట్టే అంటున్నారు నిపుణులు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube