అమ్మో.. నువ్వు మామూలోడివి కాదుగా, కొత్త సోషల్ మీడియాతో ట్రంప్‌కు డబ్బే డబ్బు.. !!

అమెరికా చరిత్రలో ఆయనో వివాదాస్పద అధ్యక్షుడు.దూకుడైన స్వభావం, తెంపరితనం కలబోసిన వ్యక్తిత్వం.

 Donald Trump Could Get Big ‘bonus’ Shares In New Social Media Firm, Trump,-TeluguStop.com

అగ్రరాజ్య రాజకీయాల్లో ఆయన శైలే ప్రత్యేకం.ఆయనెవరో కాదు రిపబ్లికన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

తనపై ఎన్ని విమర్శలు వచ్చినా, వివాదాలు చుట్టుముట్టినా ఆయన మాత్రం చెక్కుచెదరలేదు.అదే దూకుడు, అదే వ్యవహార శైలి.

రెండు వందలేళ్ల అమెరికా చరిత్రలో ఎప్పుడూ కనని, ఎన్నడూ వినని, ఎవరితో పొంతనలేని అధ్యక్షుడెవరైనా ఉన్నారంటే అది డొనాల్డ్ ట్రంప్ మాత్రమే.
ఈ సంగతి పక్కనబెడితే.

అయితే అగ్రరాజ్యానికి అధినేతగా మారడానికి ముందే ట్రంప్.అక్కడ విజయవంతమైన వ్యాపారవేత్త.

ఆయనకు అమెరికా వ్యాప్తంగా హోటల్స్, రిసార్ట్‌లు, గోల్ఫ్ కోర్టులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయి.తాజాగా సోషల్ మీడియా దిగ్గజాలు తనపై నిషేధం విధించడంతో ఇటీవల సొంతంగా ఓ సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్.

దీని పేరు ట్రూత్ సోషల్ (TRUTH Social).నవంబర్‌లో ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్.తన కార్యకలాపాలను ప్రారంభించనుంది.‘‘ ట్రూత్ సోషల్ ’’ పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ప్లాట్‌ఫామ్‌ను ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) ప్రమోట్ చేస్తుంది.

Telugu Bonus, Donald Trump, Donaldtrump, Trump-Telugu NRI

సోషల్ మీడియా దిగ్గజాలపై పంతం కొద్ది దీనిని పెట్టిన ట్రంప్.వ్యాపార కోణంలోనూ ఆలోచించారు. TRUTH Social ద్వారా ట్రంప్‌కు కాసుల వర్షం కురవనుంది.అది ఎలాగంటే.సంస్థ పనితీరు మెరుగ్గా ఉంటే స్పెషల్‌ బోనస్‌ షేర్ల కింద వందల కోట్లను మాజీ అధ్యక్షుడు వెనకేసుకునే అవకాశం ఉంది.ఒక షేరు కనీసం 30 డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువ ట్రేడింగ్‌ చేస్తే.

వారెంట్‌ కన్‌వర్టబుల్‌ 40 మిలియన్‌ షేర్లుగా మారే ఛాన్స్ ఉంది.దీని వల్ల ట్రంప్‌ సంస్థకు దాదాపు 90 మిలియన్‌ బోనస్‌ షేర్లు లభించే అవకాశం ఉంది.ప్రస్తుత ధరల ప్రకారం ట్రంప్‌ కంపెనీకి బోనస్‌ షేర్లు జారీ చేస్తే వాటి విలువ 2.4 బిలియన్‌ డాలర్లు ( భారత కరెన్సీలో రూ.17,990కోట్లు) అవుతుంది.బోనస్‌ షేర్లకు అదనంగా కంపెనీ విలీనం ద్వారా మరో 87 మిలియన్ల షేర్లు ట్రంప్‌ సంస్థ సొంతమవుతాయి.వీటి విలువ దాదాపు 5.1 బిలియన్‌ డాలర్లు ( భారత కరెన్సీలో రూ.38,230 కోట్లు) ఉంటుంది.

Telugu Bonus, Donald Trump, Donaldtrump, Trump-Telugu NRI

కాగా, అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ నేత జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6 (బుధవారం)న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.

భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.

వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ ఘటనకు సంబంధించి ఎన్నో విచారణ కమీటీలు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.దీంతో ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలు ట్రంప్‌పై నిషేధం విధించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube