ట్రంప్ కరోనా బిల్లు అట్టర్ ప్లాఫ్...!!!  

Donald Trump Corona Bill Senate - Telugu Corona Bill, Coronavirus Crisis, Donald Trump, Legislation, Senate

ప్రపంచం మొత్తాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్, అగ్ర రాజ్యం అమెరికాకి కంటి మీద కునుకు పట్టనివ్వడంలేదు.అధ్యక్షుడు ట్రంప్ ఈ కరోనా వైరస్ పుట్టిన చినా పై కారాలు మిరియాలు నూరుతున్నాడు.

 Donald Trump Corona Bill Senate - Telugu Corona Bill, Coronavirus Crisis, Donald Trump, Legislation, Senate-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా సుమారు 300 లకి పైగా మరణాలు నమోదు కావడంతో పాటు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్న నేపధ్యంలో కరోనాని పూర్తిగా అరికట్టడానికి ట్రంప్ సెనేట్ లో ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక ప్యాకేజ్ కావాలని సెనేట్ లో ప్రవేశపెట్టారు.అయితే ఈ బిల్లుకి పూర్తి స్థాయిలో మద్దతు లభించక పోవడంతో సెనేట్ లో వీగిపోయింది.
సెనేట్ లో జరిగిన సుధీర్గమైన చర్చల అనంతరం డెమోక్రాట్లు ఎవరూ కూడా ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారు.ఈ ఆర్ధిక ప్యాకేజ్ అమెరికన్లకి ఏ మాత్రం సాయం అందించలేదని అందుకే ఈ బిల్లుకి మద్దతు ఇవ్వడంలేదని తెలిపారు.

ఇదిలాఉంటే ఈ బిల్లు పాస్ అవ్వాలంటే సుమారు 60 ఓట్లు పోల్ అవ్వాల్సి ఉండగా కేవలం 47 ఓట్లు పోల్ అయ్యి వీగిపోయింది.

ట్రంప్ కరోనా బిల్లు అట్టర్ ప్లాఫ్… - Donald Trump Corona Bill Senate - Telugu Corona Bill, Coronavirus Crisis, Donald Trump, Legislation, Senate-Telugu NRI-Telugu Tollywood Photo Image

అమెరికా వ్యాప్తంగా నష్టాలలో ఉన్న వ్యాపార రంగానికి ప్రజలకి ఆర్ధిక సాయం అందించేందుకుగాను ఈ బిల్లుని ట్రంప్ ప్రవేశ పెట్టారు.అయితే ఈ బిల్లు వీగిపోయిన కారణంగా మరో సారి ఇదే బిల్లుని సెనేట్ లో ప్రవేశపెడుతామని ఈ బిల్లు రూపకర్త మిచ్ మెక్ కానెల్ ప్రకటించారు.ఈ బిల్లుకి తాము దూరంగా ఉంటున్నామని ప్రతినిధుల సభ నాన్సీ ఫెలోసీ తేల్చి చెప్పడంతో పాటు ప్రతినిధుల సభ ఇందుకు సంభందించిన బిల్లుని సొంతగా తాము రూపొందించుకుంటుందని తెలిపారు.

తాజా వార్తలు

Donald Trump Corona Bill Senate Related Telugu News,Photos/Pics,Images..