కొత్త పార్టీపై స్పష్టత...2024 మనదే : ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన తరువాత డోనాల్డ్ ట్రంప్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు.కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న ట్రంప్ మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

 America Ex President Donald Trump On Establishing New Party, America Ex Presiden-TeluguStop.com

అయితే ట్రంప్ పై అభిశంసన ఏర్పాటు చేసిన సమయంలో తన సొంత పార్టీ నేతలే కొందరు ట్రంప్ కు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో ట్రంప్ రిపబ్లికన్ పార్టీపై విసుగు చెందారని, కొత్త పార్టీ పెట్టుకునే యోచనలో ఉన్నారనే వార్తలు జోరందుకున్నాయి.దాంతో ఓటమి తరువాత మొట్ట మొదటి సారిగా ట్రంప్ మీడియా ముందుకు వచ్చి పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో మాట్లాడారు.

ఇదే వేదికపై తన కొత్త పార్టీ పై స్పష్టత కూడా ఇచ్చారు.

కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ట్రంప్ 2024 లో అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తానని ప్రకటించారు.

బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఫస్ట్ లో ఉండే అమెరికా అతి కొద్ది రోజుల్లోనే లాస్ట్ కి వచ్చిందని, ప్రపంచ దేశాల ముందు అమెరికా పరిస్థితి దయనీయంగా తయారయ్యిందని అన్నారు.మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రతీ ఒక్కరూ సైనికుడిలా ప్రనిచేయలాని పిలుపునిచ్చారు.అధ్యక్షుడిగా వైట్ హౌస్ లోకి మళ్ళీ అడుగు పెట్టె రోజు కోసం అందరూ కలలు కనాలని అన్నారు.2022 లో జరగబోయే మిడ్ టర్మ్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీని మట్టి కరిపించాలని ప్రకటించారు.ఇదిలాఉంటే

Telugu America, Americadonald, Corona, Joe Biden, Trump-Telugu NRI

కొత్త పార్టీ పెడుతారని వస్తున్న వార్తలపై స్పందించిన ట్రంప్ అలాంటి ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టత ఇచ్చారు.తాను అలా చేయడం వలన కన్జర్వేటివ్ ఓట్లు చీలుతాయని అన్నారు.బిడెన్ అధ్యక్షుడిగా కరోనా పై పోరు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని, కరోనా సమయంలో తనపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన బిడెన్ ఇప్పుడు కరోనా ను హ్యాండిల్ చేయలేక పోతున్నారని విమర్శించారు.అక్రమ వలస విధానాలకు బిడెన్ గేట్లు తెరిచారని, పారిస్ ఒప్పందం లో మళ్ళీ తిరిగి చేరడం సరైన నిర్ణయం విమర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube