పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లో ట్రంప్..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోరమైన ఓటమి పాలై ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కోర్టులు చుట్టూ తిరుగుతూ అమెరికాలో ఎన్నడూ లేనివిధంగా అల్లర్లు సృష్టిస్తూ ఆందోళనలు రేకెత్తించిన వివాదాల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయిష్టంగానే వైట్ హౌస్ విడిచి వెళ్ళిపోయారు.నాలుగేళ్ల పాలనలో ప్రజలు మెచ్చేలా చేసేన పనులు ఏమన్నా ఉన్నాయంటే అవి వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు.

 America Ex President Donald Trump Businesses In Trouble, Donald Trump, Donald T-TeluguStop.com

ఎప్పుడూ వివాదాల చుట్టూనే తిరిగే ట్రంప్ అధికారం కోల్పోయిన తరువాత ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనేది ఆసక్తిగా మారింది.అయితే కొని మీడియా ఛానెళ్ళు మాత్రం ట్రంప్ పీకల్లోతు కష్టాలలో ఉన్నాడని ప్రచారం చేస్తున్నాయి.

బిడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరావ్వకుండా వెళ్ళిపోయిన ట్రంప్ ఫ్లోరిడా చేరుకున్నారు.అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన బిజినెస్ లపై దృష్టి పెట్టలేకపోయిన ట్రంప్ ఇప్పుడు మళ్ళీ బిజినెస్ లను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

అమెరికాలో బిజినెస్ దిగ్గజుడిగా పేరొందిన ట్రంప్ కు లెక్కకు మించి హోటల్స్, రిసాట్స్ , గోల్ఫ్ క్లబ్ లు అనేక బిజినెస్ లు ఉన్నాయి.ప్రస్తుతం ఇవన్నీ నష్టాలలో ఉన్నాయట.

దాంతో పలు సంస్థలు, బ్యాంక్ లు, గోల్ఫ్ సంస్థలు ట్రంప్ తో బిజినెస్ లకు బ్రేకప్ చెప్పేస్తున్నట్టు ప్రకటించాయట.

ఇప్పటికే ట్రంప్ కంపెనీలు దాదాపు 30కోట్ల డాలర్ల అప్పుల్లో కూరుకుపోయాయని తెలుస్తోంది.

ఈ అప్పులు అన్నిటిని 4 ఏళ్ళలో ట్రంప్ కట్టేయాలంట లేదంటే మరింత కష్టాలలోకి వెళ్ళడం ఖాయం అంటున్నారు పరిశీలకులు.ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్ తమ్ముడు ఎరిక్ ట్రంప్, తనయుడు జూనియర్ ట్రంప్ లు ఈ వ్యాపారాలు చూసుకునే వారు.

ఇప్పుడు ట్రంప్ ఎంట్రీ ఇచ్చాక ఆయనే బిజినెస్ లు పర్యవేక్షణ చేస్తారని తెలుస్తోంది.అయితే తమ వ్యాపారాలు ఏవీ కూడా నష్టాలలో లేవని, గోల్ఫ్ బిజినెస్ గతంలో కంటే కూడా మరింత లాభాలలో నడుస్తున్నాయని ఏరిక ట్రంప్ ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube