ట్రంప్ చాలా డేంజర్..కూతురు ఏకంగా పుస్తకమే రాసేసింది..!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍.ఆయన గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.ఎందుకంటే.?? ఆయన మాటలతో, వ్యవహార శైలితో, ప్రవర్తనతో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు.ఆయన రూటే సపరేటు.ఆయనకు నచ్చితే ఓకే నవ్వుతూ సమాధానమిస్తాడు… లేదంటే చిటపట చిందలేస్తూ.ముఖానే తిట్టేస్తాడు.నవంబర్ 3 అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

 Donald Trump, Brothers Daughter, Mary Trump, Book On Trump,presidental Elections-TeluguStop.com

ఈ సమయంలో ట్రంప్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.ఎలాగైనా మళ్లీ అధ్యక్ష పీఠం దక్కించుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

కరోనా కష్ట కాలంలోను ట్రంప్ ధైర్యంగా ర్యాలీలు, ప్రచార సభలు నిర్వహిస్తూ.తనదైన స్టైల్ లో ప్రోసిడ్ అవుతున్నారు.

అయితే, ఈ ఎన్నికల్లో ట్రంప్ ఘోరంగా ఓడిపోతారని, ఖాయామని.జో బిడెన్ వైట్ హౌస్ కు వెల్లడం తథ్యమని పలు సర్వేలు చెపుతున్నాయి.ఇదే తరుణంలో.ట్రంప్ తనకు ఓటు వెయ్యకపోతే అమెరికన్లకే నష్టం, అమెరికన్లకే మునిగిపోతారు అన్నట్లు.“ఎన్నికల్లో నేను ఓడిపోతే.అది దేశానికే మంచి కాదని” ట్రంప్ ద్వితియార్ధంలో సంభోదించారు.

జార్జ్ ఫ్లాయిడ్ హత్య, కరోనా వైరస్ మహమ్మారి వంటి అంశాలు ట్రంప్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.ఇది ఇలా ఉండగా.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి ఇప్పుడు ఉండే సమస్యలు చాలవు అన్నట్లు కొత్తగా మరో ప్రాబ్లం వచ్చి పడ్డింది.అది ఏవరో తెలియని వాళ్లనుండి వస్తే పర్లేదు.

మన వాళ్లు కాదు కదా.అందుకే అర్ధం చేసుకోలేకపోయారు అనుకోవచ్చు.కానీ స్వయంగా ట్రంప్‌ సోదరుడు కుటుంబం నుండి వస్తే.?? అది కూడా ట్రంప్ కన్న వయసులో చిన్నదైన అమ్మాయి నుండి వస్తే.?? అబ్బో.అది మాటల్లో చెప్పలేని, వర్ణించలేని భాద, కష్టం.

సరిగ్గ ఇప్పుడు అలాంటి సమస్యనే ట్రంప్ ఎదురుకోబోతున్నారు.

Telugu Trump, Brothers, Donald Trump, Mary Trump-

ట్రంప్ గురించి ఆయ‌న‌ సోదరుడి కుమార్తె మేరీ ట్రంప్ అసక్తికర విషయాలను వెల్ల‌డించారు.‘ఆమె ఇటీవల ఓ పుస్తకం రాశారు.‘టూమచ్‌ అండ్‌ నెవర్‌ ఎనఫ్‌: హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్‌ మోస్ట్‌ డేంజరస్‌ మ్యాన్‌’ అని పేరు పెట్టారు.ఇందులో ట్రంప్‌లోని మ‌రో కోణాన్ని బ‌య‌ట‌పెట్టిన‌ట్లు తెలుస్తోంది.పుస్తకం పేరులోనే ట్రంప్‌ను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు.ఇందులో తమ కుటుంబ వివాదాలను పేర్కొన్నారు.పారనాయిడ్‌ స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్న వారిపై 6 నెలల పాటు అధ్యయనం నిర్వహించిన తర్వాత మేరీ ట్రంప్‌ ఈ పుస్తక రచనకు పూనుకోవడం గమనార్హం.

ఈ పుస్తకం వచ్చే నెలలో మార్కెట్‌లోకి రానుంది.అయితే దీన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు ట్రంప్ కుటుంబం య‌త్నిస్తోంద‌ని మేరి తరపు వాళ్లు అంటున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ్ల ఈ పుస్తకం విడుదల చెయ్యడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.కొందరైతే ట్రంప్ రాజకీయ చాప్టర్ క్లోజ్ అని కూడా అంటున్నారు.

మరి ఇన్ని తలనోప్పుల మధ్య ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కుతారా.?? లేదా.?? అన్నది ఉత్కంఠంగా మారింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube