రక్షణ కల్పించే వ్యక్తులన్న కనికరం కూడా లేదా ట్రంపూ... ఇంతకి తెగిస్తావా..?

అమెరికా చరిత్రలో ఆయనో వివాదాస్పద అధ్యక్షుడు.దూకుడైన స్వభావం, తెంపరితనం కలబోసిన వ్యక్తిత్వం.

 Donald Trump Bills Secret Service For Rooms Used At Florida Resort For His Prote-TeluguStop.com

అగ్రరాజ్య రాజకీయాల్లో ఆయన శైలే ప్రత్యేకం.ఆయనెవరో కాదు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

తనపై ఎన్ని విమర్శలు వచ్చినా, వివాదాలు చుట్టుముట్టినా ఆయన మాత్రం చెక్కుచెదరలేదు.అదే దూకుడు, అదే వ్యవహార శైలి.

రెండు వందలేళ్ల అమెరికా చరిత్రలో ఎప్పుడూ కనని, ఎన్నడూ వినని, ఎవరితో పొంతనలేని అధ్యక్షుడెవరైనా ఉన్నారంటే అది డొనాల్డ్ ట్రంప్ మాత్రమే.అన్నింటికీ మించి అత్యంత వివాదాస్పద వైఖరి ఆయన్ను అందరితో పోలిస్తే భిన్నంగా ఉండేలా చేశాయి.

ట్రంప్ ఏదైనా బహిరంగంగా చెప్పేస్తారు.ముందొక మాట, వెనకాల మరో మాట వుండవు.

ముక్కుసూటిగా వ్యవహరించే తత్వం ఆయనది.కానీ ట్రంప్ రాజకీయ జీవితానికి ఇవే పెద్ద శత్రువులు.

దీని వల్లే తనంతట తానుగా ఆయన ప్రత్యర్థులకు అవకాశాలు ఇస్తుంటారు.అధ్యక్షుడిగా జో బైడెన్ గెలిచినప్పటికీ.

విజయం తనదేనని వాదించి కోర్టుల చేతుల్లోనూ చీవాట్లు తినాల్సి వచ్చింది.అయినప్పటికీ మొండివాదన వీడకుండా క్యాపిటల్ భవనంపై తన మద్ధతుదారులును ఉసిగొల్పి ఎంతటి అప్రతిష్ట మూటకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తాజాగా ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు.తన భద్రత కోసం ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చిన గదులపై ట్రంప్‌ హోటల్‌ భారీగా బిల్లు వేసింది.అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడంతో గత జనవరిలో ట్రంప్‌ వైట్‌హౌస్‌ను ఖాళీ చేశాక ఫ్లోరిడాలోని తన మార్‌ ఎ లాగో రిసార్ట్‌లో ఉంటున్నారు.దీనినే కార్యాలయంగా చేసుకుని అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే పలువురు పార్టీ పెద్దలు, తన మద్ధతుదారులతోనూ సమావేశం నిర్వహించారు కూడా.అయితే మాజీ అధ్యక్షుడు కావడంతో ఆయనకు కొంత మంది సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బందితో ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది.

దీంతో వారికి కూడా అదే రిసార్ట్‌లో గదులను కేటాయించారు ట్రంప్.ఇందుకుగాను జనవరి నుంచి ఏప్రిల్‌ 30 వరకు 40,011 డాలర్ల బిల్లును వేశారు.అంటే రోజుకు 396.15 డాలర్లు .ఈ విషయాన్ని పబ్లిక్‌ రికార్డు రిక్వెస్ట్‌ ద్వారా ప్రముఖ దినపత్రిక వాషింగ్టన్‌ పోస్టు వెలుగులోకి తెచ్చింది.ది ఫెడరల్‌ స్పెండింగ్‌ రికార్డ్స్‌ ఆధారంగా ట్రంప్ గారి ఘనకార్యం తెలిసింది.ట్రంప్‌ పదవీకాలంలో ఆయన భద్రత కోసం 2.5 బిలియన్‌ డాలర్లను సీక్రెట్‌ సర్వీస్‌ ఖర్చుపెట్టింది.ట్రంప్‌కు ముందు అధ్యక్షులుగా చేసిన వారి ఖర్చుతో పోలిస్తే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ.

ఉదాహరణకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ 2011 నుంచి 2017 వరకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.

ఈ సమయంలో ఆయన డెలవేర్‌లోని తన నివాసంలో కొన్ని గదులను సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బందికి కేటాయించారు.దీనికి గాను నెలకు 2,200 డాలర్లు మాత్రమే ఛార్జి చేశారు.

మొత్తం ఆరేళ్ల కాలానికి గాను బైడెన్ ఛార్జి చేసిన మొత్తం 1,71,600 డాలర్లు మాత్రమే.దీనితో పోలిస్తే ట్రంప్‌ కేవలం నాలుగు నెలల కాలానికే 40వేల డాలర్లు బిల్లు వేయడం గమనార్హం.

ప్రస్తుతం ఈ విషయం అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ కల్పించేవారి పట్ల కాస్తయినా కనికరం వుండాలి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube