ఎటు చూసినా నిరసన సెగలే, అన్ని వైపులా విమర్శలే: ట్రంప్ ముందు జాగ్రత్త

అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టాలని భావించిన ట్రంప్‌ అధికార బదలాయింపుకు ససేమిరా అంటూ వచ్చారు.చివరికి అన్ని దార్లు మూసుకుపోవడంతో క్యాపిటల్ బిల్డింగ్‌పై తన మద్ధతు దారులను ఉసిగొల్పారు.

 Donald Trump Asking Aides And Lawyers About Self-pardon Power, Capital Building,-TeluguStop.com

అయితే అక్కడ ట్రంప్ అనుకున్నదొకటైతే.జరిగింది మరొకటి.

జో బైడెన్, కమలా హారిస్‌ల ఎన్నికను అధికారికంగా ధ్రువీకరించేందుకు జరిగిన ఆ సమావేశం జరగకుండా ఆటంకం కలిగించిన ట్రంప్ వర్గీయులు.క్యాపిటల్ భవనంలో వీరంగమాడారు.

చివరికి వీరిని శాంతింపజేసేందుకు పోలీసులు తూటాలకు పని చెప్పాల్సి వచ్చింది. భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు మరణించారు.

అమెరికా ప్రజాస్వామ్య చరిత్రకే మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటనతో సొంత పార్టీ నేతలు మొదలుకొని, ప్రతిపక్ష డెమొక్రాట్లు ట్రంప్‌ను దుమ్మెత్తిపోశారు.సామాజిక మాధ్యమాలు సైతం ఆయన ఖాతాలను బ్లాక్ చేశాయి.

ఇది చాలదన్నట్లు ప్రపంచ దేశాధినేతలు చురకలు వేశారు.మరో పది రోజుల్లో తాను మాజీ అయిపోతుండటంతో పదవి కాలంలో తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలపై తనను దోషిగా నిలబెడతారేమోనని భావించిన ట్రంప్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

ఈ తరుణంలో ట్రంప్‌ ‘స్వీయ క్షమాభిక్ష’ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.తనను తాను క్షమించుకునే హక్కుపై ట్రంప్‌ తన సన్నిహితులు, న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

Telugu Joe Biden, Kamala Harris, Pardon, Trump, Mike Pence, White Staff-Telugu N

కొందరికి క్షమాభిక్ష పెట్టాలని భావిస్తున్న ట్రంప్ జనవరి 19న పేర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.ఇందులో వైట్‌హౌస్‌ సిబ్బంది, అధికారులు, కుటుంబసభ్యలతో పాటు ట్రంప్‌ పేరు కూడా ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.ఒకవేళ ట్రంప్‌ క్షమాభిక్ష కోరుకుంటే ఆయన తన పదవి నుంచి దిగిపోయి.ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ని తాత్కాలిక అధ్యక్షుడిగా చేయాలి.ఆ తర్వాత ఉపాధ్యక్షుడు.అధ్యక్ష హోదాలో ట్రంప్‌కు క్షమాభిక్ష పెట్టొచ్చు.

అయితే ప్రస్తుతం ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, ట్రంప్‌ మధ్య సత్సంబంధాలు లేవు.మరోవైపు ఒకవేళ ట్రంప్‌.

స్వీయ క్షమాభిక్ష ప్రకటించుకుంటే మాత్రం.ఆయన తప్పు చేశానని అంగీకరించినట్లే అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా స్వీయ క్షమాభిక్షకు ప్రయత్నించలేదు.ట్రంప్ ఆ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇది మరో న్యాయపోరాటానికి దారితీసే అవకాశం ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube