రాబోయే రెండు వారాలు ఎంతో కఠినం అంటున్న అగ్రరాజ్యాధినేత

అగ్ర‌రాజ్యం అమెరికాను కరోనా మ‌హ‌మ్మారి గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న సంగతి తెలిసిందే.న్యూయార్క్,న్యూజెర్సీ,కాలిఫోర్నియా,మిచిగాన్,ఫ్లోరిడా, మసాచుసెట్స్,ఇల్లినాయిస్,వాషింగ్టన్,లూసియానా,పెన్సిల్వేనియా,జార్జియా,టెక్సాస్ తదితర రాష్ట్రాల్లో ఈ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతుంది.

 Donald Trump Warned Of A Very Painful Two Weeks, Donald Trump, America, Corona V-TeluguStop.com

రోజురోజుకీ యూఎస్‌లో ఈ ‘కొవిడ్‌-19’ త‌న ప్రాబ‌ల్యాన్ని పెంచుకుంటూ వెళ్తోంది.దీంతో గ‌త ఐదారు రోజులుగా వేల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,88,578 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 4,054 మంది మృతి చెందారు.న్యూయార్క్ న‌గ‌రం ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంది.

ఇక్క‌డ ఇప్ప‌టివ‌ర‌కు ఏకంగా 75,983 కేసులు న‌మోద‌వ్వడం ఆందోళన కలిగిస్తుంది.అయితే ఈ విపత్కర పరిస్థితుల పై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ రాబోయే రెండు వారాలు ఎంతో కఠినమైనవి అని విస్తరిస్తున్న తీవ్రతను బట్టి సుమారు 2.40 లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చని వైద్య నిపుణుల అంచనా ప్రకారం తెలిసిన చేదు నిజం అంటూ ట్రంప్ పేర్కొన్నారు.రాబోయే కఠిన రోజులను ఎదుర్కొనేందుకు అమెరికన్లు రెడీ గా ఉండాలని ట్రంప్ సూచించారు.

అంతేకాకుండా ఈ కరోనా వైరస్ ను ప్లేగు వ్యాధితో పోల్చారు.పౌరులు త‌ప్ప‌నిస‌రిగా వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌, సామాజిక దురాన్ని పాటించాల‌ని కోరారు.

ఇలా చేయ‌డం వ‌ల్ల త‌మ‌ను తాము కాపాడుకోవ‌డంతో పాటు చుట్టుప‌క్క‌ల వారిని కూడా క‌రోనా బారిన‌ప‌డ‌కుండా కాపాడిన వారు అవుతారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఈ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మంది ఈ కరోనా మహమ్మారి బారిన పడగా,40 వేల మందికి పైగా మృతులు చోటుచేసుకున్నాయి.చైనా తరువాత అత్యధికంగా ఇటలీ,ఇరాన్,స్పెయిన్ లలో ఈ కరోనా మృతుల కేసులు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.

అగ్రరాజ్యం అమెరికా లో కూడా ఈ కరోనా ప్రభావం అధికంగా ఉండడం తో అక్కడ కూడా భారీ స్థాయిలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube