అరెరే ట్రంప్.. ఐసోలేషన్ నిబంధనలు అతిక్రమిస్తే ఎలా?

చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు ఎలాంటి వ్యాక్సిన్ లు లేకపోవడంతో గత 8 నెలలుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది.

 Trump Isolation Rules Are Violated Corona Virus, Donald Trump, America Presiden-TeluguStop.com

ఇక ఈ కరోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని జాగ్రత్తలు చెప్తున్నారు.అయినప్పటికీ ఎవరూ తగిన జాగ్రత్తలు పాటించకపోగా నియమాలను అతిక్రమిస్తున్నారు.

ఇక అలానే అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రాంప్ కూడా నిబంధనలను అతిక్రమించాడు.

వారం రోజుల క్రితం డోనాల్డ్ ట్రంప్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

తనకు కరోనా సోకగా కొన్ని నిబంధనలు పాటించకపోగా అందరినీ భయాందోళనలకు గురి చేస్తున్నారు.ఆదర్శంగా ఉండాల్సిన ట్రంప్ ఏ జాగ్రత్తలు పాటించకుండా ఉన్నందున కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఐసోలేషన్ నిబంధనలు అతిక్రమిస్తున్నాడు.

దేశ అధ్యక్షుడైన ట్రంప్ ఇతరులకు జాగ్రత్త సలహాలు ఇవ్వాల్సింది పోయి నిబంధనలు అతిక్రమించి విమర్శలపాలవుతున్నాడు.

కరోనా వైరస్ వంటి మహమ్మారి విషయంలోనే అజాగ్రత్తగా ఉన్న ట్రంప్ దేశంలోని సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తారో అర్థం కాని పరిస్థితిగా మారింది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

కరోనా పాజిటివ్ అయినా మాస్కు ధరించిన రోజు లేదు.గత వారం నుండి కరోనా వైరస్ కు ట్రంప్ గురికాగా, సైనిక ఆస్పత్రిలో 3 రోజులు చికిత్స పొందుతూ సోమవారం వైట్ హౌస్ కు చేరుకున్నారు.

అక్కడికి వెళ్లిన ట్రంప్ కరోనా నిబంధనలు పాటించక పోగా తన అధ్యక్ష పాలన చూసుకుంటున్నాడు.మొత్తానికి తన పనులు నిర్వర్తించడానికి తర్వాత రోజు నుంచి తన విధుల్లో పాల్గొనగా కరోనా ఐసోలేషన్ నిబంధనలను పాటించకుండా తన కార్యాలయానికి వెళ్లారు.

గల్ఫ్ ఆఫ్ మెక్సికో లో వస్తున్న తుఫానులపై సమీక్షించేందుకు ట్రంప్ వెళ్లినట్లు తెలిసింది.తన కోవిడ్-19 నిబంధనలు పాటించక తన పనులను కొనసాగించడంతో వైట్ హౌస్ సిబ్బంది భయానికి లోనవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube