రంగంలోకి ట్రంప్ అర్థాంగి: ఆయనో ఫైటర్ అంటున్న మెలానియా

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వున్న కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రిపబ్లికన్లు, డెమొక్రాట్లు వ్యూహా ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.ట్రంప్- బిడెన్‌ల గెలుపే లక్ష్యంగా వారి మద్ధతుదారులు ర్యాలీలు, ప్రచార సభలకు తోడుగా సోషల్ మీడియా క్యాంపెయిన్లు, టీవీల్లో డిబేట్లు నిర్వహిస్తుండటంతో అగ్రరాజ్యంలో ఎన్నికల పర్వం రణ రంగాన్ని తలపిస్తోంది.

 donald Is A Fighter: Melania Trump Hits Campaign Trail For Her Husband Trump, A-TeluguStop.com

ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీని రంగంలోకి దించారు.ఇప్పటికే ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ తండ్రి కంటే ఎక్కువగా దూసుకెళ్తున్నారు.

డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ భారత్‌కు అనుకూల వ్యక్తి కాదని, అతను చైనాకు మద్దతుదారు అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రథమ మహిళ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ తొలిసారి ప్రచార రంగంలోకి అడుగుపెట్టారు.

మంగళవారం పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అట్‌గ్లస్ పట్టణంలో జరిగిన ఓ ఎన్నికల సభలో భర్త తరపున ప్రచారం చేశారు.తన భర్త నిజమైన యోధుడని కొనియాడారు.దేశమంటే ఆయనకు అపారమైన ప్రేమ అని, అందుకోసం ఆయన ప్రతి రోజూ పోరాడతారని పేర్కొన్నారు.సోషల్ మీడియా ద్వారా అమెరికా అధ్యక్షుడు ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉండడం దేశ చరిత్రలోనే తొలిసారన్నారు.

ఈ సందర్భంగా కరోనా సోకినప్పుడు తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మెలానియా కృతజ్ఞతలు తెలిపారు.కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన 2.25 లక్షల మంది కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.కొవిడ్‌పై అమెరికా తప్పక విజయం సాధిస్తుందని మెలానియా ఆశాభావం వ్యక్తం చేశారు.

Telugu Donaldfighter, America, French, German, Molaniaplace, Molaniya, Serbia, T

స్లోవేనియాలో జన్మించిన మెలానియా మొదట మోడల్‌గా పరిచయమయ్యారు.90 దశకం చివరల్లో ఆమె ట్రంప్‌తో డేటింగ్‌లో వున్నారు .అప్పట్లో మెలానియాను టాప్ మోడల్‌గా తీర్చిదిద్దడంలో ట్రంప్ ప్రముఖ పాత్ర పోషించారు.చివరికి 2005లో తమ మధ్య ఉన్న సంబంధాన్ని ట్రంప్ స్వయంగా బయటపెట్టారు.

అప్పటికే తమ ఎంగేజ్‌మెంట్ జరిగిందని చెప్పారు.అదే ఏడాది వీరిద్దరూ వివాహం చేసుకోగా, అప్పుడే ఆమెకు యూఎస్ పౌరసత్వం కూడా లభించింది.2006లో మెలానియాకు కుమారుడు జన్మించాడు.మెలానియా బహుభాషా కోవిదురాలు.

స్లొవేనియా, ఫ్రెంచ్, సెర్బియా, ఇంగ్లీష్, జర్మన్ భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube