మళ్ళీ పోటీ చేస్తా..ట్రంప్ అధికారిక ప్రకటన ఎప్పుడంటే..

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మరో మారు పోటీ చేస్తానని ముందు నుంచీ చెప్తూనే వస్తున్నారు.రిపబ్లిక్ పార్టీ తరుపున తగ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ట్రంప్ మరో మారు అధ్యక్ష పదవికి పోటీ చేయడాని సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈ మేరకు ట్విట్టర్ లో ట్రంప్ ఓ సందేశం ఇచ్చారు.2016 ఎన్నికల్లో తన విజయంలో కీలకంగా నిలిచిన ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ నెల 18న నిర్వహించనున్న సభలో ఈ మేరకు అధికారిక ప్రకటన చెయనున్నట్లుగా వెల్లడించారు.

 Donal Trump Says Iam Stand In American Elections-TeluguStop.com

భార్య మెలానియా, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ,ఆయన భార్య కరెన్ కూడా ఓర్లాండోలో జరగబోయే కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు తాను మళ్ళీ 2020లో మరోసారి పోటీచేస్తానని ప్రకటించారు.

అంతేకాదు ఇప్పటికే పలు మిలియన్ డాలర్ల నిధులు సేకరించారు ట్రంప్.అయితే తనని గద్దె దించే కార్యక్రమానికి డెమాక్రటిక్ పార్టీ నేతలు ముమ్మరం చేయడంతో ట్రంప్ రంగంలోకి దిగుతున్నాడని స్థానిక మీడియా ప్రచారం చేస్తోంది.

మళ్ళీ పోటీ చేస్తాట్రంప్ అధిక

ఇదిలాఉంటే డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ముందు వరసలో ఉన్న మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ పై ట్రంప్ ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.అయితే ఈసారి డెమోక్రాటిక్ పార్టీలో అధ్యక్షా పదవి రేసుకు జో బిడెన్ , బెర్నీ శాండర్స్ మధ్యే పోటీ ఉంటుందని ట్రంప్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.మరి 2020 నవంబర్ 3న జరగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అంటూ వేచి చూస్తున్నారు అమెరికన్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube