ఈ తెలుగు విలన్ ఎంత పెద్ద కోటీశ్వరుడో తెలిస్తే అవాక్కవుతారు....

తెలుగులో ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ మరియు దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన “డాన్” చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ విలన్ “కెల్లీ డోర్జీ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ చిత్రంలో నాగార్జునతో పాటు కెల్లీ డోర్జీ కూడా సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు.

 Don Movie Villain Kelly Dorji Real Life And Profession News, Kelly Dorji, Tollyw-TeluguStop.com

అంతేగాక టాలీవుడ్లో వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలను దక్కించుకుని బాగానే రాణిస్తున్నాడు.అయితే ఇప్పుడు కెల్లీ డోర్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

కెల్లీ డోర్జీ భూటాన్ దేశంలో పుట్టి పెరిగాడు. ఇతడి తండ్రి భూటాన్ దేశం యొక్క ప్రభుత్వ సంస్థలో ఉద్యోగిగా పని చేసేవాడు. అయితే చిన్నప్పటినుంచి కెల్లీ డోర్జీ కి నటనపై ఆసక్తి ఉండటంతో పాఠశాలలో మరియు కాలేజీలో జరిగేటువంటి  నాటకాలలో బాగానే పాల్గొనేవాడు. అంతేగాక కాలేజీ తర్వాత మోడలింగ్ కోర్సు చదివి కొంత కాలం పాటు అదే రంగంలో పని చేశాడు కూడా.

  ఈ క్రమంలో 2004వ సంవత్సరంలో తెలిసిన వారి ద్వారా ఓ బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుని తన నటనా ప్రతిభను నిరూపించుకున్నాడు.అయితే కెల్లీ డోర్జీ కి సొంతంగా భూటాన్ దేశంలో “టేర్టన్ ట్రావెల్ బూటాన్” అనే టూరిస్ట్ కంపెనీ ఉంది.

ఈ సంస్థ ఇతడికి ఒక ఏడాదిలో తను నటించిన చిత్రాల వల్ల వచ్చేటువంటి ఆదాయం కంటే ఎక్కువ మొత్తాన్ని సంపాదించి పెడుతుంది. కానీ కెల్లీ డోర్జీ మాత్రం నటనపై తనకు ఆసక్తి ఉండటంతో సినిమాలపైనే దృష్టి సారిస్తున్నాడు.

కాగా ఆ మధ్య ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడు.  కానీ పలు కారణాల వల్ల ఆమెను పెళ్లి చేసుకోలేకపోయాడు.

Telugu Don Villain, Donvillain, Kelly Dorji, Tertontravel, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో కెల్లీ డోర్జీ సినిమాల పరంగా కొంతమేర జోరు తగ్గించినట్లు తెలుస్తోంది.కాగా తెలుగులో చివరగా ప్రముఖ దర్శకుడు చిన్నికృష్ణ దర్శకత్వం వహించిన “బ్రదర్ అఫ్ బొమ్మాలి” అనే  చిత్రంలో విలన్ గా కనిపించాడు. ఆ తర్వాత మళ్ళి ఇప్పటివరకు తెలుగు సినిమాలలో నటించలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube