పిజ్జా లవర్స్‌కు షాక్ ఇచ్చిన Domino's Pizza... ? ఇకపై ఆ యాప్‌లో ఆర్డర్ మీరు చేయలేరు!

నేటి యువత ఇష్టాలలో ఒకటిగా డొమినోస్‌ పిజ్జా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.చాలామంది ఆహార ప్రియులు దీనిని అమితంగా ఇష్టపడుతుంటారు.

 No Domino's Pizza On Food Delivery Apps Zomato And Swiggy,domino's Pizza,food De-TeluguStop.com

ఇక దానిని ఆన్లైన్లోనే విరివిగా ఆర్డర్ చేస్తారనే విషయం అందరికీ తెలిసినదే.కొంతమంది డైరెక్ట్ గా డొమినోస్‌ సైట్, లేదా యాప్ నుండే దానికి ఆర్డర్ చేసుకోగా, అనేకమంది ఆహార ప్రియులు జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌లో వాటి కోసం ఎక్కువగా ఆర్డర్‌లను పెడుతూ వుంటారు.

ఇపుడు అలాంటివారికి షాక్ ఇస్తోంది డొమినోస్.

అవును, మరి మరికొద్ది రోజుల్లో ఈ రెండు యాప్స్‌లో పిజ్జాలను ఆర్డర్ చేయడం ఆపేస్తోంది డొమినోస్‌.

ఎందుకంటే డొమినోస్‌ పిజ్జా ఇండియా ఫ్రాంచైజీ జొమాటో, స్విగ్గీల ఆర్డర్‌లను తీసుకోకూడదని యోచిస్తోంది.CCI (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా)కి సంబంధించిన ఒక ప్రైవేటు ఫైల్‌లో డొమినో నిర్వహణ సంస్థ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ఈ వివరాలు పేర్కొంది.“కమీషన్ల రేట్లు ఇంకా పెరిగితే.జూబిలెంట్ తన మరిన్ని వ్యాపారాలను ఆన్‌లైన్ రెస్టారెంట్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఇన్-హౌస్ ఆర్డర్ సిస్టమ్‌కు మార్చాలని యోచిస్తోంది” అని జులై 19న CCIకి రాసిన లేఖలో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ పేర్కొంది.

Telugu Dominos, Delivery App, Lovers, Nrai, Shock, Swiggy, Zomato-Latest News -

జొమాటో, స్విగ్గీ యాంటీ కాంపిటేటివ్ పద్ధతులపై విచారణలో భాగంగా CCI డొమినోస్‌ ఇండియా, అనేక ఇతర రెస్టారెంట్ల నుంచి అభిప్రాయాలను కోరింది.ఇందులో భాగంగా డొమినోస్‌ ఇండియా భారతదేశంలో జులై నెలలో తన వ్యాపారంలో దాదాపు 27% మొబైల్ యాప్, వెబ్‌సైట్‌తో సహా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి జరిగినట్లు వెల్లడించింది.NRAI (నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఈ యాప్‌లు విపరీతమైన కమీషన్లతో పాటు ఇతర యాంటీ కాంపిటీటివ్ పద్ధతులను అనుసరిస్తున్నాయని ఆరోపించిన తర్వాత CCI ఏప్రిల్‌లో జొమాటో, స్విగ్గీలపై విచారణ ప్రారంభించింది.ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube